బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మాజీప్రధానిస్వర్గీయ పివిజయంతి వేడుకలు

Jun 29, 2026 - 00:45
 0  0
బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మాజీప్రధానిస్వర్గీయ పివిజయంతి వేడుకలు
బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మాజీప్రధానిస్వర్గీయ పివిజయంతి వేడుకలు

తెలంగాణ వార్త, జూన్ 28 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- బహుభాషా కోవిదులు, భారత అభివృద్ధి ప్రదాత, భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పి వి  నరసింహారావు గారి జయంతి వేడుక భద్రాద్రి బ్రాహ్మల పురోహిత సంఘం వారు నిర్వహించారు. ముందుగా  పి.వి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర  అధ్యక్షులురామావఝల. రవికుమార్ మాట్లాడుతూ భారతదేశం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి.వి నరసింహారావుగారు అపర చాణిక్యునిగా వ్యవహరించి శ్రీ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసి తన అమేయమేధా సంపత్తితో నూతన ఆర్థిక, పారిశ్రామిక విదేశాంగవిధానాలులో ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు జరిపి భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టే విధంగా తీర్చిదిద్ది, విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న మన దేశ బంగారాన్ని కూడా విడిపించిన ఘనత ప్రధాని శ్రీ పి వి కే దక్కిందని, బొటా బొటి మెజార్టీతో కేవలం భారత అభివృద్ధి ధ్యేయంగా నిర్మొహమాటంగా బాధ్యతలు నిర్వర్తించి భారత గౌరవాన్ని త్రిగుణీకరించిన మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు భారత చరిత్రలో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారని రవికుమార్ తెలిపారు. పదవి విరమణ పిదప దేశ అభివృద్ధికి కృషిచేసిన మాజీ ప్రధాని శ్రీ.పి.వి. పై అనేక అక్రమ కేసులు బనాయించినప్పటికీ, సత్యమేవ జయతే అనే విధంగా అక్రమ కేసుల నుండి కడిగిన ముత్యంలా ఉన్నత న్యాయస్థానాల తీర్పుతో తన నిజాయితీని నిరూపించుకున్న మహనీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ పివి భారతరత్నగా అత్యున్నత గౌరవ పురస్కారం భారత రాష్ట్రపతి నుండి స్వీకరించారని శ్రీ పి వి సేవలను రామావఝ ప్రశంసించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రామా వజ్జల. రంగనాయకుల గుట్ట,  గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలకోట. శ్రీనివాసాచార్యులు రాయప్రోలు. సత్యప్రసాద్ శర్మ, సిరిపురపు.అశోక్ కుమార్ శర్మ, మోటుపల్లి. వేణుగోపాలా చార్యులు, ఆర్.వి వీరభద్ర శర్మ, ఆర్ మహేష్, బుక్క పట్నం రామాచార్యు లు, ఆర్ నగేష్, శ్రీరాం పవన్, చిట్టి. వెంకటేశ్వర్లు, నరసింహ శాస్త్రి, కె.సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్స్ బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333