బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని వెంటనే అరెస్ట్ చేయలి
బహుజన జై భీమ్ ఆర్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పనికిరా కృష్ణ
శాలిగౌరారం 15 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–
మత్తు పదార్థాలతో అమాయుకురాలైన..ఒక మైనర్ బాలికను లొంగదీసుకుని అత్యాచారo చేసి నాలుగు రోజులు కావస్తున్నా కేంద్ర హోo సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథను ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు...!తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నత వర్గాలకు ఒక రాజ్యాంగం పేద వర్గాలకు ఒక రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.మోడీ బంధం..రేవంత్ రెడ్డి బంధం తెలంగాణలో బలంగా ఉందని సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..ఉన్నత వర్గాలపై ఒక రకమైన శిక్షలు అమలు చేస్తున్నారని..బీజేపీ పార్టీ మంత్రి బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..అరెస్టు చేయకుండా వదిలేయడం ఇదేమీ న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని.ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థలు,సమాజం అందరు బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డీజీపీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర బహుజన జై భీమ్ ఆర్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పనికిర కృష్ణ డిమాండ్ చేశారు.