అంబేద్కర్ జయంతి భోజన ఏర్పాట్లలో నిర్లక్ష్యం – ఎంపీడీవో కార్యాలయంలో మిగిలిన ఇస్తరాకులు
శుభ్రతపై విమర్శలు… బాధ్యతారాహిత్యంపై స్థానికుల ఆగ్రహం.
జోగులాంబ గద్వాల 15 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన భోజన కార్యక్రమం తర్వాత మిగిలిన ఇస్తరాకులను మున్సిపల్ సిబ్బంది తొలగించకుండా వదిలేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జయంతి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయగా,కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడే ఇస్తరాకులు మరియు చెత్త పేరుకుపోయి ఉండటం గమనార్హం.ఈ పరిస్థితిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ,శుభ్రతపై నిర్లక్ష్యం చూపారని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల తర్వాత తక్షణమే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు అలాంటి చర్యలు చేపట్టకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.