పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం సిగ్గు చేటు

May 15, 2026 - 18:56
 0  1
పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం సిగ్గు చేటు

విశ్వగురువు నరేంద్ర మోడీ ధరలు పెంచటానికే ఉన్నాడా.
-
సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు.

 జోగులాంబ గద్వాల 15 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. కొడుకుని కాపాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి  బండి భగీరథ్ ను అరెస్టు చేస్తేనే చట్టంపై అందరికీ విశ్వాసం ఏర్పడుతుంది 

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) డిమాండ్ చేసింది. విశ్వగురువు అంటే కేవలం ధరలు పెంచటానికేనా అంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు ప్రశ్నించారు. శుక్రవారం నాడు సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. ఇప్పటివరకు దేశంలో అన్నిరకాల పన్నులు పెంచడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. GST, అధిక పన్నులు ధరలు పెంచి దేశంలో సామాన్యులు బ్రతకకుండా చేస్తున్నారని విమర్శించారు. విశ్వగురువు, వికసిత్ భారత్, భేటీ బచావో భేటీ పడావో అనే నినాదాలు మోసం చేయటానికి తప్ప మరోటి లేదన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలు ప్రపంచ ఆకలి సూచిలో అత్యంత వెనుక  బడిన దేశ జాబితాలో ఉన్నారని,అభివృద్ధిలో కూడా దేశం వెనకబడిందని 141 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇలాంటి మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం పాలించడం ఒక శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. బంగారు కొనొద్దు వస్తువులు కొనొద్దు, ఖర్చులు తగ్గించాలి, పొదుపు చేయాలనేటువంటి మాటలు ఈ దేశ ప్రమాద ఘటికలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏమైనా మాట్లాడితే మతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుక్కోవడం తప్ప ఈ కేంద్ర బిజెపి ప్రభుత్వం మరోటి చేయడం లేదన్నారు. రోజురోజుకీ ప్రజల ఆదాయం తగ్గి విపరీతమైన ఖర్చులు పెరుగుతున్న సందర్భంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అంటే మొలిగేనక్కపై తాటికాయ పడ్డట్టుగా కేంద్ర పాలన తీరు ఉందని ఆగ్రహం వెలిబుచ్చారు. 
అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను అరెస్టు చేస్తేనే చట్టంపై అందరికీ విశ్వాసం కలుగుతుందని, 
తన కొడుకుని కాపాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలనీ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.
ఒక కేంద్రమంత్రి తన కుమారుడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే ఇక దేశంలో రాష్ట్రంలో రక్షణ ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. కేంద్రమంత్రి పదవి ఉన్నందుకే మైనర్ బాలికకు న్యాయం జరగకుండా బండి భగీరత్ ను అరెస్ట్ చేయకుండగా చట్టం ఇంకా కాలయపన చేస్తుందని విమర్శించారు అందుకే ప్రధానమంత్రి బండి సంజయ్ ని తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని లేనిచో ప్రధానమంత్రి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఇప్పటికైనా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని ఏమాత్రం మహిళల పట్ల మైనార్టీ బాలికల పట్ల గౌరవం ఉంటే బండి భగీరథ్ ను అరెస్టు చేయించి బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పేరు కృష్ణ, ఎలుకూరు రంగన్న, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వెంకటేశ్,aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్,aiyf జిల్లా నాయకులు పరమేశ్, బైక్ రిక్షా నాయకులు తిమ్మప్ప, ధర్మన్న, నరసింహులు,aiyf వెంకటేష్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333