2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్

Jun 29, 2026 - 19:48
 0  2
2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్

మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎయిమ్స్, ఐసీఎంఆర్ హెచ్చరించాయి.  ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, 2030 నాటికి ఏటా 15.7 నుంచి 20 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయడం, మహిళలు క్రమం తప్పకుండా బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం, అలాగే తగిన హెల్త్ ఇన్సూరెన్స్, అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333