గుడికి స్థలాన్ని ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
కృష్ణానగర్ కాలనీ కృష్ణానగర్ అసోసియేషన్ వారికి ఇచ్చిన మాట ప్రకారం గుడికి ఇస్తానన్న స్థలాన్ని ఇచ్చే మాట నిలబెట్టుకోవాలని కృష్ణానగర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు సైదాబాద్ కృష్ణానగర్ కాలనీలోని కృష్ణానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలు కిందట అపార్ట్మెంట్ నిర్మాణానికి ఓ నిర్మాణదారుడు అపార్ట్మెంట్ నిర్మాణం కోసం కొంత స్థలం అవసరం ఉండగా పక్కనే ఉన్న గుడి స్థలాన్ని రాత్రికి రాత్రి ఆక్రమించి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాలనీ నివాసులు ఇదేమిటని ప్రశ్నించగా గుడి నిర్మాణానికి 200 గజాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ గుడి కోసం కొంత స్థలాన్ని ఇచ్చి మాట తప్పారని అపార్ట్మెంట్ నిర్మాణ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 200 గజాల స్థలాన్ని తప్పకుండా ఇవ్వాలని ఇవ్వకుండా మోఖం చాటేస్తే మేము ఊరుకున్నా దేవుడు వారిని క్షమించడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, వారిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు.