గాలి వానకు వరిలో కూలిన వృక్షం 

Oct 20, 2024 - 21:47
Oct 20, 2024 - 21:48
 0  52
గాలి వానకు వరిలో కూలిన వృక్షం 

అడ్డగూడూరు 20 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన కడెం సోమయ్య అనే నిరుపేద రైతు పొలంలో శనివారం రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో కురిసిన గాలివాన వర్షానికి ఈదురుగాలి రావడంతో చెట్టు పొలంలో కుప్పకూలింది. తెల్లవారుజామున రైతు సమయనికి పొలం దగ్గరికి వెళ్లి చూసేసరికి పొలం మధ్యలో విరుగున్నచట్లను చూసి నాకు వాపోయారు. గ్రామంలోని వివిధ రైతుల పొలాలలో వరిసేను నేలమట్టం కావడం చాలా బాధాకరం తీరా చేతికి వచ్చే సమయానికి ఇలాంటి గాలి దుమ్ములు అకాల వర్షాలు రావడం రైతులకు ఎనలేని నష్టం వాటిల్తోందని రైతులు వాపోయారు. మండలాధికారులు ఎమ్మార్వో వివిధ గ్రామాలను సందర్శించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని అందించాలని రైతులు కోరారు.