గర్భిణీ మహిళా మృతి కేసులో 7 గురు నిందితులను అరెస్ట్ చేసిన తుంగతుర్తి పోలీసులు
గర్భిణీ స్త్రీ మృతికి సంబంధించి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.
- మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం.
- లింగ నిర్ధారణ పరీక్ష చేయించి అబార్షన్ చేయించిన భర్తను, అబార్షన్ చేసిన ఇద్దరు ఆర్ఎంపీలను, స్కానింగ్ పరీక్ష నిర్వహించిన వారిని మరియు సహకరించిన వారిని అరెస్టు చేయడం జరిగింది.
కేసు వివరాలను సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి ప్రసన్నకుమార్. ముందస్తు లింగ నిర్ధారణ పరీక్ష నేరము, అర్హత లేకున్నా వైద్యం చేయడము నేరము. వైద్య చట్టాల ప్రకారం మరియు ముందస్తు లింగ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ హెచ్చరించారు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగ బిడ్డ అని లింగ నిర్ధారణ పరీక్ష చేయించి ఆడబిడ్డ అని తేలడంతో తుంగతుర్తి పట్టణంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నందు అబార్షన్ చేయగా మహిళా మృతి చెందినది ఇది చట్టవిరుద్ధము.
మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయగల శ్రీను తన భార్యకు కడుపునొప్పి రాగా తుంగతుర్తిలో సాయి బాలాజీ హాస్పిటల్ కు తీసుకువచ్చి పరీక్షలు చేయించినాము, బిడ్డ అడ్డం తిరిగింది అని చెప్పు వైద్యం చేయగా తీవ్రంగా అస్వస్థతకు గురి అయినది, వెంటనే ఖమ్మంలో వైద్యం చేయించడానికి తీసుకెళ్లామని అయినప్పటికీ నా భార్య చనిపోయినది అని చికిత్స చేసిన బండి శ్రీనివాసు ఆర్ఎంపీ డాక్టర్ నాభార్య మరణానికి కారకుడని ఫిర్యాదు ఇవ్వగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము, ఇందులో RMP డాక్టర్ ను విచారించగా మృతురాలి భర్త మూడవసారి కూడా ఆడబిడ్డ ఉన్నదని అబార్షన్ చేయాలని మా హాస్పటల్ కు తీసుకుని వచ్చారు, అబార్షన్ చేసే క్రమంలో విజిత కు అధిక రక్త స్రావం జరిగినది ఖమ్మం తీసుకెళ్లగా చనిపోయినట్లు దర్యాప్తులో తేలినది. భర్త తప్పుడు పిర్యాదు చేశారు. తుంగతుర్తి CI నరసింహారావు అధ్వర్యంలో కేసు దర్యాప్తు చేయడం జరిగినది. నేరం సంఖ్య 108/25 ప్రకారము భారతీయ న్యాయ సంహిత, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సెక్షన్ 23, సెక్షన్ 3 మరియు ఫ్రీ కాన్సెప్షన్ అండ్ ఫ్రీ నటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం దర్యాప్తు చేసి 7 గురు నిందితులను అరెస్ట్ చేశాము.
నేరం విధానం
బయగల శ్రీను వయసు 33 సంవత్సరాలు గ్రామం గోరంట్ల మద్దిరాల మండలం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇతన భార్య విజిత మూడవసారి గర్భం దాల్చడంతో గర్భంలో ఉన్నది ఆడ మగ అని ఖమ్మం పట్టణంలో స్కానింగ్ చేయించి ఆడపిల్లని తెలవగా అబార్షన్ చేయించాలన్న ఉద్దేశంతో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బండి శ్రీనివాస్ ను సంప్రదించి అబార్షన్ చేయడానికి పూనుకుంటారు. A1 బండి శ్రీనివాస్ A7 పానుగంటి సతీష్ తో కలిసి ఐదో నెల గర్భవతి అయిన విజితకు శుక్రవారం రోజున తుంగతుర్తి మండల కేంద్రంలో సాయి బాలాజీ హాస్పిటల్ నందు అబార్షన్ చేయడం జరిగినది. ఈ అబార్షన్ వికటించి తీవ్రతస్రావం జరగడంతో మహిళ మృతి చెందడం జరిగింది. 5వ నెల గర్భవతి అయిన విజితకు తన భర్త ఖమ్మంలో A5 తుమ్మ చర్ల అరుణ అనే నర్సును సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం జరిగినది. ఈ పరీక్షను ఖమ్మం పట్టణంలో A6 పోలంపల్లి కల్పన అనే మహిళ నిర్వహిస్తున్న కల్పన క్లినిక్ నందు చేయడం జరిగినది. ఖమ్మం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ A3 సంపేట అశోక్ స్కానింగ్ పరికరంతో కడుపులో ఉన్నది ఆడ మగ అని లింగ నిర్ధారణ పరీక్ష చేయడం జరిగినది, సంపేట అశోక్ కు A4 పులి వీరభద్ర రావు లింగ నిర్ధారణ పరీక్ష చేసే స్కానర్ ను సమకుర్చినట్లు గుర్తించడం జరిగినది.
గర్భంలో ఉన్నది ఆడ మగ అనే లింగ నిర్ధారణ కోసం ముందస్తు పరీక్షలు చేయడం నేరము, ఇలాంటి చర్యలకు పాల్పడితే వైద్య చట్టాల ప్రకారము మరియు ముందస్తు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధ చట్టం ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. ఇలాంటి వాటికి సహకరించిన, ప్రేరేపించిన ఆలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చేస్తామని అన్నారు. గర్భవిచ్చితికి సంబంధించిన మందులు అమ్మిన సహకరించిన అలాంటి ఆసుపత్రులను మెడికల్ షాపులను సీజ్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ కి రిఫర్ చేస్తామని డిఎస్పి తెలిపారు, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే పోలీసు వారికి సమాచారం ఇంచించాలి అని DSP తెలిపినారు.
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కేసును లోతుగా విచారణ చేసి ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, అబార్షన్ చేసిన, దీనికి సహకరించిన 7గురు నిందితులను గుర్తించి ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
నిందితులు :
A1 - బండి శ్రీనివాస్ వయసు 47 వృత్తి ఆర్ఎంపీ డాక్టర్ తుంగతుర్తి పట్టణం. సాయి బాలాజీ క్లినిక్ నిర్వాహకుడు. (అబార్షిన్ చేసిన ఆర్.ఎం.పి)
A2 - బోయగల శ్రీను వయసు 33 సంవత్సరాలు వృత్తి పెయింటర్ గోరంట్ల గ్రామము మద్దిరాల మండలం (మృతురాలి భర్త)
A3 - సంపెట అశోక్ వృత్తి లాబ్ టెక్నీషియన్ మరియు స్కానింగ్ చేయడం, ఖమ్మం పట్టణం (స్కానింగ్ నిర్వహించిన వ్యక్తి)
A4 - పులి వీరభద్ర రావు వయసు 48 ఖమ్మం పట్టణం వృత్తి వ్యవసాయం (స్కానింగ్ చేసే పరికరం సమకూర్చిన వ్యక్తి)
A5 - తుమ్మ చర్ల అరుణ, వయసు 35 సంవత్సరాలు వృత్తి నర్సు, ఖమ్మం పట్టణము. (స్కానింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన మహిళ)
A6 - పోలంపల్లి కల్పన వయసు 45 సంవత్సరాలు వృత్తి కల్పనా క్లినిక్ నిర్వాహకురాలు, ఖమ్మం పట్టణము (స్కానింగ్ చేయడానికి క్లినిక్ ఆశ్రమించిన మహిళ)
A7 - పానుగంటి సతీష్ వయసు 39 సంవత్సరాలు వృత్తి ఆర్ఎంపీ డాక్టర్ నాగారం మండలం పసునూరు గ్రామము. (అబార్షన్ చేయడానికి A1 కు సహకరించిన వ్యక్తి)