నిద్రమత్తులో అధికారులు
పెయింట్ వేశారు సూచిక బోర్డులు మరిచారు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
రోజులు గడుస్తున్న కన్నెత్తిచూడని అధికారులు
ఇప్పటికైనా అధికారులు అలసత్వం వదిలి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల కొత్త బస్టాండ్ లో సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులు వారి వారి పనుల నిమిత్తం రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు... కాగా కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెయింట్ వేసే క్రమంలో సూచిక బోర్డులు కనుమరుగయ్యాయి... పెయింట్ పూర్తి చేసి రోజులు గడుస్తున్న ఇంతవరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ బస్సు ఏ ప్లాట్ఫారం వద్ద ఆగుతుందో తెలియని అయోమయం పరిస్థితి నెలకొందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యానికి కారణం అవుతున్న అధికారులపై ప్రయాణికులు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాత్కాలికంగానే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర విడాలని ప్రయాణికులు ప్రజలు అధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు....
ప్రయాణికుల ఆవేదన
కనీస సూచిక బోర్డులు లేకపోవడంతో ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదని.. ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ఏర్పాటుచేసిన అధికారుల అలసత్వంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.