గద్వాల వార్డుల యందు ఉన్న బీపీ షుగర్ ఉన్న వార్డు ప్రజలకు ప్రతినెల ఫాలోఅప్ నిర్వహించాలి
ఆశా కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశాలు :- ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్.
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లా అర్బన్ రాంనగర్ మరియు వంటెల్ పెట్, స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తలకు... ఎన్ సి డి ప్రోగ్రాం పై రివ్యూ తీసుకోవడం జరిగింది... అందులో భాగంగా ప్రతినెల బీపీ షుగర్ ఉన్నవారికి ఫాలొ అప్ నిర్వహించాలని... జిల్లా నందు పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందని.. జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ ఈరోజు ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశంలో తెలిపారు.... ప్రతినెలా వార్డు ప్రజలకు పరీక్షల అనంతరం మందులు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ నిర్వహించాలని... తెలిపారు.... అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో ఉన్న వసతులు... అనగా ఎల్డర్లికేర్, పాలియేటివ్ కేర్, ఎన్సిడి క్లినిక్, మెంటల్ హెల్త్,.. ఇవన్నీ ప్రజలకు అవగాహన కల్పించి వార్డు ప్రజలు ఇట్టి అవకాశాలన్ని ఉపయోగించుకోవాలని... తెలిపారు....ఇట్టి కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్ఎం.. హనుమంతు నరసింహులు, ఏఎన్ఎంలు మార్తా, సువర్ణ, రంగమ్మ సూర్యకాంతమ్మ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.....