గత ఫిబ్రవరి నెలలో గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు PS ల పరిధిలో వరుస దొంగతాలకు పాల్పడ్డ ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను
ఒక బంగారం రిసివర్ ను అరెస్టు చేసిన గరిడేపల్లి పోలీస్
- BNS చట్టాల ప్రకారం వ్యవస్థీకృత నేరాల సెక్షన్ క్రింద కేసులు నమోదు.
- 3.5 లక్షల విలువగల 7.3 తులాల భంగారం, రూ.87 వేల నగదు మరియు 3 సెల్ ఫోన్స్, 1 బైక్ స్వాదినం చేసుకున్నా గరిడేపల్లి పోలీసులు.
- హుజూర్నగర్ పట్టణంలో ఇంటి దొంగతనం కేసులో 1.5 లక్షల విలువగల 17 గ్రాముల భంగారం, 14 వేల రూపాయల నగదు స్వాదినం చేసుకుని ఒక దొంగను అరెస్ట్ చేసిన హుజూర్నగర్ పోలీసులు.
గరిడేపల్లి పోలీసులు డిటెక్ట్ చేసిన 6 కేసులు మరియు హుజూర్ నగర్ పోలీసులు డిటెక్ట్ చేసిన 1 కేసు మొత్తం 07 దొంగతనం కేస్ లలో సుమారుగా 5 లక్షల విలువగల 09 తులాల బంగారం ఆభరణాలు మరియు Rs.1,01,000/- నగదు సీజ్ చేసి నలుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుంది.
జిల్లా పోలీస్ కార్యాలయం నందు అధనపు SP నాగేశ్వరావు, DSP శ్రీధర్ రెడ్డి, CI చరమంధ రాజు లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు.
కోదాడ డివిజన్ పరిధిలో గత నెలలో జరిగిన వరస దొంగతానాలపై అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు, వనరుల సమాచారంతో అధికారుల పర్యవేక్ష్నలో హుజూర్ నగర్ సర్కిల్ CI చరమంద రాజు, గరిడేపల్లి SI నరేశ్, హుజూర్నగర్ SI ముత్తయ్య, నేరేడుచర్ల SI రవీందర్ మరియు టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది బాగా వర్క్ చేసి దొంగలను పట్టుకోవడం జరిగినది అని ఎస్పీ గారు తెలిపినారు. ప్రజలు గృహాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, విలువైన వస్తువులు ఆభరణాలు భద్రంగా ఉంచుకోవాల అని అన్నారు. సామాజిక భద్రతలో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి అన్నారు. అపార్ట్మెంట్స్, దుకాణ సముదాయాలు, నివాస గృహాల కు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పి గారు కోరారు.
Garidepally PS
CR.NO.39/2025 U/s 331 (4), 305, 111 (6), 316 (2) BNS OF PS GARIDEPALLY
గరిడేపల్లి పోలీసు అరెస్ట్ చేసిన నిందితులు :
A-1) చిల్లర సురేష్ @ చల్లా సురేష్, వయసు: 38 సం.రాలు, వృత్తి: టైల్స్ వర్క్,R/o అమరావతి రోడ్, శారద కాలనీ, H.No. 26, లైన్, గోరెంట్ల, గుంటూర్ పట్టణం మరియు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,
A-2) బత్తుల రాజు, వయసు: 32 సం.రాలు, వృత్తి: సుతారి మేస్త్రి, R/o ఇబ్రహీంపట్నం, కొత్తగేట్, ప్రభుత్వ పాఠశాల రోడ్,విజయవాడ,యన్ టీ ఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,
A-3 (రిసీవర్) చింత నాగేశ్వరావు, వయసు: 43 సం.రాలు, వృత్తి: ప్ల౦బర్ వర్క్,R/o కలెక్టర్ కాంపౌండ్, R&B క్వార్టర్, గుంటూరు పట్టణం,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.
నిందితులు A1, A2 ఇద్దరు కలిసి వ్యవస్థీకృతంగా దొంగతనాలకు పాల్పడుతూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రాత్రిపూట పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు ఆభరణాలు దొంగలిస్తుంటారు.
గరిడేపల్లి పి యస్ పరిధిలో రెండు పగటి పూట, ఒకటి రాత్రి పూట దొంగతనం కేసు, పాలకవీడు లో రెండు పగటి పూట దొంగతనం కేసు, నేరేడుచర్ల పి యస్ పరిధిలో ఒక పగటి పూట దొంగతనం కేసు లను ఛేదించిన గరిడేపల్లి పోలీసులు.
స్వాదిన వివరాలు : 3. 5 లక్షల విలువగల 7.3 తులాల బంగారం, రూ.87 వేల నగరు రికవరీ.
కేసు వివరాలు :
ఈరోజు అనగా తేది 11.03.2025 తెల్లవారుజామున 03.00 గంటల సమయమున గరిడేపల్లి యస్. ఐ తమ సిబ్భంది తో కలిసి మండలకేంద్రం పొనుగోడు X రోడ్డు వద్ద వాహనములు తనిఖీ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు Pulsar బండి నంబర్. AP07DZ7531 పై అనుమానాస్పదంగా పోలీసు వారిని చూసి వారు తమ బైక్ ను వెనుకకు తిప్పి పారిపోతుండగా గుర్తించి వారిని పట్టుబడి చేసి తనికి చేయగా వారి వద్ద దొంగతనం చేయబడిన బంగారపు వస్తువులు మరియు కొంత నగదు లభించినవి. వారిని విచారించగా అట్టి సొమ్ము దొంగతనం చేసిన సొత్తుగా ఒప్పుకున్నారు. అట్టి సొమ్మును తాకట్టు/అమ్ముటకు గాను సూర్యపేట వెళ్ళుతునట్లు తెలిపినారు.
A1 చిల్లర నరేశ్, A2 బత్తుల రాజు ఇద్దరు వ్యక్తులు కలసి మూకుమ్మడిగా/వ్యవస్థీకృతంగా ఏర్పడి దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుంటారు మరియు అమాయక ప్రజల ఇండ్లలో దొంగతనాలు చేసి అక్రమముగా బంగారం, వెండి, డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకొని తేదీ. 21.02.2025 రోజు గరిడేపల్లి మండలం, నేరేడుచర్ల, పాలకవీడు మండలంలలో తాళం వేసి ఉన్న ఇళ్ళలో ప్రధాన డోర్ లాక్ పగుల గొట్టి మరియు ఇంటిలోకి వెళ్ళి బీరువా లు పగులగొట్టి బంగారం, వెండి, డబ్బులు దొంగిలించి వరస దొంగతనాలకు పాల్పడడం జరిగింది. దొంగిలించిన కొంత బంగారం మరియు డబ్బులను గుంటూర్ కు చెందిన చింత నాగేశ్వరావు కు బంగారం కుదువ పెట్టమని ఇవ్వడం జరిగింది. ఇట్టి వ్యక్తులపై గరిడేపల్లి పి యస్ పరిధిలో మూడు కేస్ లు, నేరేడుచర్ల పి యస్ పరిధిలో ఒక కేస్, పాలకవీడు పి యస్ పరిధిలో రెండు కేస్ లు నమోదు కావడం జరిగింది. A1 A2 లు వారి వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టడానికి పల్సర్ బైక్ పై వెళుతుండగా పట్టుకోవడం జరిగినది వారి నుండి దొంగతానానికి ఉపయోగించే ఇనుప రాడ్డు, గ్లౌస్ లు, తప్పుడు నెంబర్ ప్లేట్, కలిగి ఉండగా అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది తదుపరి వారి ఒప్పుకోలు అనంతరం రిసీవర్ చింత నాగేశ్వరావు ను గుంటూర్ లో పట్టుబడి చేసి వారి నుండి మొత్తం మూడు సెల్ ఫోన్ లు పైన తెల్పబడిన సొత్తుకు సంబందించి సుమారు 7.3 తులాల బంగారం మరియు Rs.87,000/- రూపాయల నగదు ను పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని మొత్తం ఆరు కేస్ లలో రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
ప్రధాన నిందితుడు A-1 చల్లా సురేష్, పై రెండు తెలుగు రాష్టాలలో మొత్తం 64 కేస్ లు (గుంటూర్ జిల్లా, బాపట్ల జిల్లా, నరసరావు పేట జిల్లా, ఎన్‌టిఆర్ జిల్లా, విజయవాడ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, నిర్మల్ జిల్లా, సూర్యపేట జిల్లా లలో నమోదు అయ్యి ఉన్నవి. చిల్లర సురేశ్ గతంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, లాలపేట్, కొత్తపేట్ పోలీసు స్టేషన్ లలో నమోదైన 6 కేసుల్లో జైలుకు వెళ్ళినాడు.
A-2 బత్తుల రాజు పై రెండు తెలుగు రాష్టాలలో 09 కేస్ లు (గుంటూరు, నరసరావు పేట, బాపట్ల, ఎన్‌టిఆర్ జిల్లా, విజయవాడ, సూర్యపేట జిల్లాలలో నమోదు అయ్యి ఉన్నవి.
Huzurnagar PS
CR.NO.49/2025 U/s 331 (4), 305 BNS OF PS HUZURNAGAR
- ఒక దొంగను అరెస్ట్ చేసిన హుజూర్నగర్ పోలీసులు.
- 1.5 లక్షల విలువగల17 గ్రాముల భంగారం, 14 వేల రూపాయల నగదు స్వాదినం.
నింధితుడు భీమిశెట్టి ప్రదీప్, వయసు: 24 సం.రాలు, కులం: నాయుడు, వృత్తి: ఫ్లవర్ డెకరేషన్, R/o యాదవ్ బజార్, హుజూర్ నగర్ పట్టణం.
కేసు వివరములు: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన బోజనపల్లి నాగేశ్వర రావు తన కుమార్తె వివాహ నిమిత్తం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మహమ్మద్ షబ్బు కు మండపం కట్టమని కోరగా, షబ్బు దగ్గర పనిచేసే భీమిశెట్టి ప్రదీప్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ తేదీ 07.03.2025 రోజున రాత్రి బీరువా పగలగొట్టి అందులో 17 గ్రాముల బంగారం చైన్ మరియు 14 వేల నగదు దొంగలించుకెళ్ళినాడు అని అనుమానం వ్యక్త పరుస్తూ పిర్యాధు ఇవ్వగా, అట్టి పిర్యాధు పై Cr.No. 49/2025 U/s 331(4), 305 BNS ప్రకారముగా కేసు నమోదు పరిచి, ఈరోజు 11-03-2025 నమ్మదగిన సమాచారం మేరకు ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకోగా, అతనిని నుండి 17 గ్రాముల బంగారం చైన్ 14 వేల నగదు రికవరీ చేయడం జరిగింది.
గరిడేపల్లి పోలీసులు డిటెక్ట్ చేసిన 6 కేసులు మరియు హుజూర్ నగర్ పోలీసులు డిటెక్ట్ చేసిన 1 కేసు మొత్తం 07 దొంగతనం కేస్ లలో సుమారుగా 5 లక్షల విలువగల 09 తులాల బంగారం ఆభరణాలు మరియు Rs.1,01,000/- నగదు, 3 సెల్ ఫోన్స్, 1 బైక్ సీజ్ చేసి నలుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుంది.
వరుస దొంగతలతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఇట్టి దొంగలను పట్టుకోవడానికి SDPO కోదాడ M. శ్రీధర్ రెడ్డి గారు పర్యవేక్షణలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి హుజూర్ నగర్ CI G చరమంద రాజు గారి ఆద్వర్యంలో, కేసును ఛేదించిన గరిడేపల్లి యస్ ఐ Ch.నరేశ్ గారిని, యస్ ఐ హుజూర్ నగర్ G. ముత్తయ్య, మరియు ID పార్టీ సిబ్బంది రామారావు, నాగరాజు, శ౦భయ్య, డ్రైవరు నాగరాజు ను ఎస్పీ గారు అభినంధించారు.