గత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోలేదు

Sep 3, 2026 - 21:42
 0  2
గత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోలేదు

 తిరుమలగిరి 04 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  మలి దశ ఉద్యమ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ రథసారథి, ఉద్యమకారులు డా,, పిడమర్తి రవి ఆదేశానుసారం తిరుమలగిరి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఓయూ మాదిగ విద్యార్థి జేఏసీ కన్వీనర్ మీసాల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డు, బస్ పాస్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సెప్టెంబర్ 16న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్వహించే రెండు తరాల ఉద్యమకారుల సమ్మేళన సభను తుంగతుర్తి నియోజకవర్గ తొలి,మలి దశ ఉద్యమకారులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కేకే కమిటీ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం. శుభ పరిణామన్నారు. సెప్టెంబర్ 16న జరిగే కృతజ్ఞత సభ కి నియోజకవర్గ ఉద్యమకారులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు కొమ్ము ప్రవీణ్, టీం సామెల్ అన్న వ్యవస్థాపకులు ఎర్ర నరేష్, బొట్టు సురేష్,లోడే మల్లేష్,M సతీష్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి