గట్టు నుండి గద్వాలకి వెళ్లే ప్రధాన రహదారిలో భారత్ మాల ఆరు వరసల రోడ్డు అండర్ ప్లస్ బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేసే వరకు పోరాటం చేస్తాం
భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్
* జోగులాంబ గద్వాల 18 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గట్టు. మండలం నుండి గద్వాలకు వెళ్లే రెండు వరసల ప్రధాన రోడ్డు కు భారత్ మాల అరువరసల రోడ్డు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేయాలనీ నిర్మాణం చేసే వరకు పోరాటం చేస్తామని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు.
* ఈరోజు భారత్ మాల రోడ్డుపై రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
* వారు మాట్లాడుతూ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన చోట కాకుండా రోడ్డుకు 250 మీటర్ల దూరంలో నిర్మాణం చేయడం జరిగింది అయితే దానికి L రూపంలో పాసింగ్ ఉన్నది ఆ విదంగా ఉండడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అన్నారు, గట్టు ప్రాంతాన్ని ఎవరు అడుగుతారులే అని ఇష్టం వచ్చినట్టు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది,, వెంటనే మెన్ రొడ్డకు బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మేఘ కంపెనీ కాంట్రాక్టర్లను హెచ్చరించారు ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు
కార్యక్రమం లో రాయపురం ప్రజలు రాముడు, తిమ్మప్ప, వీరేష్, వెంకన్న భీమ్ ఆర్మీ మల్దకల్ మండల అధ్యక్షులు యేసేపు, గట్టు మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు