ప్రాణ రక్షణే లక్ష్యం: ‘అరైవ్ అలైవ్’తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం 

Apr 16, 2026 - 19:50
 0  2

జోగుళాంబ గద్వాల 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల. చాగాపురం రైతు వేదిక నందు పోలీస్ శాఖ ప్రజా భద్రతపై తమ అంకితభావాన్ని మరోసారి స్పష్టంగా చాటింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ఉద్యమానికి సర్పంచ్ సావిత్రమ్మ ఆధ్వర్యంలో చాగాపురం రైతు వేదిక నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ఇటిక్యాల ఎస్ఐ రవి మాట్లాడుతూ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ఆగి ప్రజల్లో రోడ్డు భద్రతపై లోతైన అవగాహన కల్పించనుంది.  ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని గ్రామంలోని యువకులకు మరియు గ్రామ ప్రజలకు ఎస్సై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

ప్రమాదాలపై పోలీసుల యుద్ధ ప్రకటన. హెల్మెట్ ధరించడం, కారులో సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటడం, వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్ పాటించడం, లైన్ డిసిప్లిన్‌కు కట్టుబడి డ్రైవింగ్ చేయడం వంటి ప్రాథమిక నియమాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ, ప్రతి ప్రయాణం సురక్షితంగా మారేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో వెళ్లడం వంటి ప్రాణాంతక అలవాట్లపై కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
, “రోడ్డు ప్రమాదం ఒక సంఘటన కాదు… అది ఒక కుటుంబాన్ని శాశ్వతంగా కుదేలుచేసే విషాదం. హెల్మెట్ ఒక ఎంపిక కాదు, ప్రాణ రక్షణ కవచం. సీట్ బెల్ట్ ఒక నియమం కాదు, జీవితం కోసం అవసరం. రోడ్డు మీద ప్రతి అడుగు బాధ్యతతో వేస్తేనే మనం సురక్షితంగా ఇంటికి చేరగలం” అని గట్టిగా పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం 

* అరైవ్ అలైవ్ — నిర్లక్ష్యాన్ని వదిలి, బాధ్యతను అలవాటు చేసుకుంటేనే ప్రతి ప్రయాణం సురక్షితం… ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది.
 ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333