గంజాయి స్వాధీనం ...యువకుడు అరెస్ట్

Jan 4, 2026 - 21:38
 0  650
గంజాయి స్వాధీనం ...యువకుడు అరెస్ట్

  మోత్కూరు 04 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నేడు గంజాయి కేసు నమోదయింది. మోత్కూర్ ఎస్సై కొంపెల్లి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, మోత్కూరు ప్రాంతానికి పెద్ద మొత్తంలో గంజాయి రవాణా అవుతోందన్న నమ్మకస్తుల సమాచారం మేరకు పోలీసులు మోత్కూరు పోతాయి గడ్డకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మోత్కూరుకు చెందిన సందీప్ అనే యువకుడు నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ యువకుడి వద్ద నుంచి సుమారు 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు. అనంతరం అతడిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గంజాయి రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.అక్రమ మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి