క్యాన్సర్ నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయి అవగాహన స్థానిక నివారణ చర్యలు  కీలకమైనవి

Mar 2, 2024 - 21:05
Mar 11, 2024 - 00:50
 0  4

అవగాహన పెంచడం, నివారణ చర్యలు వేగవంతం చేయడం,

జీవనశైలిని మార్చుకోవడం లక్ష్యంగా నిర్వహించబడుతున్న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.

తెలుసుకుందాం-- నిర్మూలనకు, నివారణకు ఆత్మస్థైర్య0తో  ఆలంబనగా నిలబడదాం.

--- వడ్డేపల్లి మల్లేశం

ఈనాడు ప్రపంచవ్యాప్తంగా  కొనసాగుతున్న మరణాలలో 10 ఇంటిలో ఏడు మరణాలు క్యాన్సర్ వల్లనే కావడం  ఆందోళన కలిగించే విషయం  .క్యాన్సర్ భయంకరమైన  రోగమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత  ఆ భయము నుండి విముక్తి పొందడానికి సమాచారాన్ని సేకరించడం అవగాహన పెంచుకోవడం  కీలకంగా  ఉండడం కోసం  క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి మద్దతునిచ్చి ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసమే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం .    2000 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన  ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో  జరిగిన  ప్రపంచ క్యాన్సర్  సమ్మిట్ లో  కీలక నిర్ణయం తీసుకోవడం  ఆనాటి నుండి గత 24 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగడం  ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ను అరికట్టడానికి జరుగుతున్న కృషిలో అగ్ర భాగం అని చెప్పక తప్పదు.  ఆ సమావేశం పరిశోధనలు ప్రోత్సహించడానికి,  క్యాన్సర్ నుండి విముక్తికీ  రోగులకు అందవలసిన సేవలను మరింత మెరుగుపరచడానికి  తోడ్పడాలని ఉద్దేశంతో  చార్టర్ ఆఫ్ పారిస్ అగైన్స్ట్ క్యాన్సర్  పత్రంలో  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా  ప్రారంభించే అంశాన్ని కూడా చేర్చడం  అదే రోజు యునెస్కో డైరెక్టర్ ఆమోదించడంతో  నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు  పరిశీలన ద్వారా తెలుస్తున్నది.

2009 నుండి 2024 వరకు  ప్రతి మూడేళ్ల కు ఒక్కసారి అంతర్జాతీయ దినోత్సవానికి  బలమైన థీమ్ ను ఎంపిక చేసినట్లుగా దీనికి సంబంధించిన చరిత్ర ద్వారా తెలుస్తున్నది.

  • 2009- 10 సంవత్సరాలలో  "నేను నా ఆరోగ్యకరమైన చురుకైన బాల్యాన్ని ప్రేమిస్తున్నాను"  అనే నినాదం స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
  • -- 2010 -11 సంవత్సరాలలో  "క్యాన్సర్ ను నివారించవచ్చు" అనే నినాదం   ప్రధాన ఎజెండాగా మారినది.
  • --  2012 సంవత్సరాన్ని  "కలిసి మనం ఏదైనా చేద్దాం" అనే థీమ్తో  క్యాన్సర్ నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది  .
    --2013 సంవత్సరానికి  ప్రధాన ఎజెండాగా "క్యాన్సర్ అపోహలు వాస్తవాలను తెలుసుకుందాం"  గా నిర్ణయించినారు  .
    --2014 సంవత్సరాన్ని "అపోహలను తొలగించండి " అనే థీమ్తో  ఎత్తిచూపగా 2017 సంవత్సరానికి  నాట్ బియాండ్   అజ్ అని   నినదించారు.  2016 నుండి 18 సంవత్సరాల మధ్యన  "మనం చేయగలం నేను చేయగలను"  అనే ధైర్యంతో  నివారించే ప్రయత్నం  కొనసాగినట్లు తెలుస్తున్నది.
    --  ఇక 2019 నుండి 21 మధ్య కాలంలో  "ఐ ఆమ్ అండ్ ఐ విల్"  ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి  ఈ నినాదం తోడ్పడగా  ప్రస్తుతం 2022 నుండి 24 మధ్యకాలంలో  ఇచ్చిన నినాదాన్ని గమనిస్తే "క్లోజ్ ది కేర్ గ్యాప్"  అవాంతరాలను అడ్డుకుందాం  అవగాహనను పెంచుకుందాం  అవసరమైన అంశాలపై  దృష్టిసారిద్దాం అనే  అర్థంలో  ప్రాధాన్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.
  •  2008 ఫిబ్రవరి 4న  యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్  సంస్థచే  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం డిక్లేర్ చేయబడినప్పటికీ  2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలని లక్ష్యాన్ని  2008 నాటి డిక్లరేషన్  ఆమోదించినట్లుగా తెలుస్తున్నది. .  ప్రపంచవ్యాప్తంగా మరణాలకు  మొదటి ప్రధాన కారణం గుండెపోటు అయితే  రెండవ ప్రధాన కారణం  అంతేకాదు 70% క్యాన్సర్ మరణాలు  అల్ప మధ్య ఆదాయ దేశాల్లోనే  సంభవించడాన్నీ మనం గమనించవచ్చు . ప్రణాళిక ఆర్థిక వనరులను సకాలంలో  సమీకరించుకోవడం ద్వారా  నివారణ చర్యలను  సమస్య తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు  నిర్మూలనకు తగిన వ్యూహాలను అమలు చేయడం ద్వారా  లక్షలాది మంది జీవితాలను రక్షించవచ్చునని ప్రధాన ఎజెండాతో  చైతన్యాన్ని అవగాహనను ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం  ఉద్దేశించబడిన ఈ అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం  ఊరు  వాడవాడలా  కొనసాగినప్పుడు మాత్రమే  బాధితులు పీడుతులకు  ఉపశమనం లభిస్తుంది.  ఈ మేరకు ప్రపంచ దేశాల యొక్క  శ్రద్ధ నిబద్ధతను  నొక్కి చెప్పిన ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ  తక్షణమే కీలకమైన చర్యలను తీసుకోవడం ద్వారా  మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని చేసిన సూచన  జరుగుతున్న అమలు  మొత్తంలో మరణాలను సమర్ధవంతంగా అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
  • క్యాన్సర్ అంటే ఏమిటి కొంత అవగాహన:-
  • పూర్వకాలంలో సరైన చికిత్స లేని కారణంగా  మరణాల సంఖ్య గణనీయంగా ఉండేది కానీ ఇటీవల కాలంలో శాస్త్రీయ పరిశోధనలు వేగవంతమైన సందర్భంగా  పెద్ద మొత్తంలో అరికట్టడానికి అవకాశం లభించింది . అమెరికా ఇతర దేశాలలో జరుగుతున్న పరిశోధన ఫలాలను భారతదేశం లోపల కూడా అమలు చేస్తున్న సందర్భాలను మనం గమనించవచ్చు."  శరీరంలో ఎక్కడైనా  ఆ సందర్భంగా అసాధారణంగా కణాల యొక్క  అదుపు లేని పెరుగుదలను  క్యాన్సర్ అనవచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఈ వ్యాధి సోకే అవయవాలను బట్టి  ఆ వ్యాధికి పేరు పెట్టడం జరుగుతున్నది  ప్రపంచవ్యాప్తంగా  ఈ వ్యాధి అత్యంత స్థాయిలో విస్తరించి ఉన్నట్లుగా  తెలుస్తూ ఉంటే
      క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు  ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణాంతక వ్యాధి యొక్క విస్తరణ  ఉధృతి  గమనించి దానిపైన తగు రీతిలో పోరాడేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలను సిద్ధం చేయడం కూడా ఈ దినోత్సవం యొక్క  లక్ష్యంగా గుర్తించాలి . అంతేకాదు అపోహలను తగ్గించడం,  సరైన సమాచారాన్ని ఇవ్వడం,  ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం,  నివారణ మార్గాలను తెలియజేయడం,  సరైన పోషకాహారం  సూచించడం  జరుగుతున్నది .అందులో భాగంగా భారతదేశంలో క్యాన్సర్ నుండి ప్రజలను రక్షించడానికి  జరుగుతున్న పలు రకాల ప్రచార కార్యక్రమాలలో భాగంగా  ప్రతి సంవత్సరం నవంబర్ 7 తేదీన  దేశవ్యాప్తంగా క్యాన్సర్ అవగాహన దినోత్సవం  జరుపుకుంటున్నట్లు  తెలుస్తుంది.
          కొన్ని కారణాలను అన్వేషిస్తే  :-

      శరీరంలోని జీవకణాలు  అవసరాలకు అనుగుణంగా కొత్త కణాలను ఏర్పరుస్తాయి  దెబ్బతిని చనిపోయినప్పుడు కొత్త కణాలు వాటి స్థానంలో తిరిగి  ఏర్పడతాయి కానీ క్యాన్సర్లు అలా జరగదు.  శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందినప్పుడు కణాలు అసాధారణంగా మారుతాయి  అంతేకాదు పాత కణాలు చనిపోయే బదులు    కొత్త కణాల అవసరం లేనప్పటికీ  అవి కూడా అభివృద్ధి చెంది నియంత్రణ   లేకుండా కన విభజన జరుగుతూ   అదుపు లేకుండా విభజించబడి  కనితులుగా మారుతాయి  అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
      ఇక కొన్ని లక్షణాలను సాధారణంగా  చెప్పదలుచుకుంటే  గొంతు మంట, తరచుగా దగ్గు రావడం,  తినేటప్పుడు మింగడంలో ఇబ్బంది , శరీరంలో ఏ భాగము నుండైనా నీరు లేదా రక్తం ప్రవహించడం , పుట్టుమచ్చల రంగు  మారడం  పెరుగుదల,  శరీరంలో ఏర్పడిన గాయాలు చాలా కాలం పాటు  మానకపోవడం,  ఆకలి లేకపోవడం,  కారణం లేకుండా బరువు తగ్గడం లేదా పెరగడం,  అన్నివేళలా అలసట లేదా బద్ధకం ఏర్పడడం,  ఇబ్బందితో కూడిన మూత్ర విసర్జన  ప్రధానంగా ఈ లక్షణాలను గమనించవచ్చు. తీవ్రంగా పట్టిపీడిస్తున్న ఈ అనారోగ్యాన్ని  నివారించడానికి  అవగాహన అతి పెద్ద విషయమని  అంతే స్థాయిలో ఆరోగ్యకరమైన జీవనశైలి ,ఆహారం కూడా ముఖ్యమని  వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
          తీవ్రమైన అనారోగ్యానికి తీసుకున్న మందుల కారణంగా కూడా ఈ  క్యాన్సర్ రావచ్చు కానీ ఇతర కారణాలు కూడా ఉన్నాయని  వైద్యులు సూచిస్తున్నారు.  ధూమపానం, అధిక బరువు , పోషక విలువ లేని ఆహారం,  పొగాకు నమలడం,  శారీరక శ్రమ వ్యాయామం లేకపోవడం కూడా ప్రధాన కారణాలుగా భావించాలి.  ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గుదల కూడా ఇందుకు కారణం కావచ్చు.
          నివారణకు, అదుపు చేయడానికి సూచనలు:-

      సంపూర్ణ ఆరోగ్యంతో పాటు క్యాన్సర్ నివారణకు క్షారతత్వ ఆహారం అవసరమని  నిపుణులు సూచిస్తున్నారు.  టమాట, బొప్పాయి,  దబ్బ కాయ, నారింజ, బెర్రీస్, బ్రొకోలీ, కాలీఫ్లవర్,  క్యాబేజీ ,క్యారెట్ , దోసకాయ, సొరకాయ,  బూడిద గుమ్మడి, నేతి బీర, కొబ్బరి,  తులసి, మంచి పసుపు  వంటి ఆహార పదార్థాలు క్షార గుణాన్ని పెంచుతాయని  క్యాన్సర్ నివారణ ,నిర్మూలనలో తోడ్పడతాయని చెప్పవచ్చు.   కొబ్బరి పాలు, నువ్వుల పాలు, వేరుశనగ పప్పు  ఇతోది కంగా దోహదపడతాయి.  ముఖ్యంగా  సిరి ధాన్యాల ఆహారం  తోడ్పడుతుందని గత  దశాబ్ద కాలంగా స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త ఖాదరవలి  గారు చేస్తున్న ప్రచారం ప్రబోధం  ఆచరణలో  ఎంతో మేలు చేసినట్లుగా  అనుభవాల ద్వారా తెలుస్తున్నది . ఇక సకాలంలో తగినంత నిద్రపోవడం, పోషక ఆహారం తీసుకోవడం,  యోగా, ధ్యానం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం,  ప్రకృతి వైద్య విధానాలను తరచుగా పాటించడం , మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, ఆత్మస్థైర్యంతో  సానుకూల దృక్పథంతో  నూతన జీవనశైలిని అలవర్చుకోవడం   మందులు చికిత్సకు అదనంగా జోడించినట్లయితే  మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతోపాటు  రోగ తీవ్రతను కూడా పెద్ద మొత్తంలో అరికట్టవచ్చు.  ఆహార  ఆరోగ్య నిపుణులు చేస్తున్న ఈ సూచన  ఈ సందర్భంగా ఆకలింపు చేసుకోవడం ద్వారా రోగ  తీవ్రతను అరికట్టే ప్రయత్నం చేయడం  ప్రతి ఒక్కరి బాధ్యత.  స్థానికంగా ఆలోచించడం అంతర్జాతీయ స్థాయిలో అవగాహన ద్వారా పరస్పరం విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా  అదుపు చేయడానికి మరింత ఆస్కారం ఉన్నది .


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333