పాలకుల దివాలా కోరుతనానికి నేటి ఆర్థిక పరిస్థితి అద్దం పడుతుంది
ఎగవేత దారులపై ఉక్కుపాదం మోపడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి.
అక్రమార్కులు అవినీతిపరులెవరైనా కీ విచారణతో రాబట్టి ప్రజలకు పంపిణీ చేయాలి.
గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.
---వడ్డేపల్లి మల్లేశం
పాలకులు ఎవరైనా ప్రజల ఆకాంక్షల మేరకు లక్ష్యాల సాధన వైపుగా ఆర్థిక అరాచకత్వానికి తావు లేకుండా వసూలు చేయాల్సిన పన్నులు సుంకాలను నిర్బంధంగా జమచేసి ఆదాయాలను పెంచుకోవడంతో పాటు సామాన్య ప్రజానీకానికి ఆ సంపదను పంచడం ద్వారా సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలి . కానీ అందుకు భిన్నంగా అనేక ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు మద్దతిస్తూ సంపన్న వర్గాల పన్ను ఎగవేతకు కేంద్ర ప్రభుత్వం వలె సహకరిస్తూ ప్రభుత్వ సంస్థలను దివాలా తీ యించే క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతూ తమ పబ్బం గ డుపుకోవడానికి స్వార్థ రాజకీయాలకు తలపడుతున్న వారు కూడా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం దివాలా తీసిందని దివాలా కోరు రాజకీయాల కారణంగా లక్ష్యాలు ఆదర్శాలు విస్మరించి
ప్రజా సంపదను కొలగొట్టి పెత్తందారులకు పట్టం కట్టి అక్రమ సంపాదనప రులను అందల మెక్కించిన ప్రభుత్వం కనుకనే గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిన దివాలా కోరు ప్రభుత్వం అని చెప్పడం అతిశయోక్తి కాదు .
అసంబద్ధ విధానాల పైన న్యాయ విచారణ జరిపించాలి:-
ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్లు శాసనసభ్యులు మంత్రులు ఇతర పెట్టుబడిదారులు ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించుకొని కోట్లాది రూపాయలకు ఎదిగిన వైనాన్ని సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు . ప్రతి పాలనలోను ఇది సాధారణమే అని చెప్పినప్పటికీ గత పది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో మాత్రం అక్షరాల ప్రజలకు ద్రోహం చేసి, సామాన్య ప్రజల నోటి ముందు బుక్కను కొల్లగొట్టి, సంపదను కూలదోసి చేసిన అరాచక పాలనకు ముగింపు గా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అవినీతి పైన ప్రతి రాజకీయ నాయకుని పైన న్యాయ విచారణ జరిపించి అక్రమాల నీ గ్గు తేల్చి నిర్బంధంగా వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. ప్రజలకు పంపినీ జరగాలి. ప్రభుత్వ భూముల అమ్మకాలు, నామమాత్రపు రేటుకే పెత్తందారులకు స్వాధీన పరిచిన సంఘటనలు, రైతుబంధు వంటి కేసుల్లో గుట్టలు పుట్టలు చెట్లు అడవులకు ఇండ్ల స్థలాలకు కూడా లక్షలాది ఎకరాలకు సంపన్న వర్గాలకు కట్టబెట్టి చేసిన ద్రోహం మీద విచారణ జరిపి చెల్లించిన అధికారులు ప్రజాప్రతినిధులకు శిక్ష విధించాలి .అదే సందర్భంలో అప్పనంగా పొందిన అక్రమార్కుల నుండి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేసి ప్రజా నిధులను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది . ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పైన విద్యుత్ పరిస్థితి పైన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ మిడిసి పడినటువంటి బిఆర్ఎస్ నాయకులు శ్వేత పత్రం తప్పులతడక అని తమ భాష (ఆంగ్లము) వాదనాపటి మను సాకుగా చూపి ప్రభుత్వాన్ని నోరు మూయించే దౌర్జన్యపూరిత ప్రవర్తన ను అందరం కల్లారా చూసినాము. చేసిన నేరాన్ని అంగీకరించకపోగా ప్రభుత్వం పైన బురద సల్లే ప్రయత్నం చేయడం అంటే నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే కదా! అన్ని నేరాలు ఘోరాలు అక్రమాలు నిజ నిర్ధారణలో న్యాయ విచారణలో బయటపడిన నాడు ప్రజాధనం ఏరకంగా కొల్లగొట్టబడిందో ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి రాజకీయ సమాధి కట్టినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ఆగడాలకు ఆస్కారం ఉండదు .
ముఖ్యంగా ప్రభుత్వం కావాలని చేసినటువంటి ఈ నేరాలకు అధికారుల పరంగా కూడా మద్దతు ఉండడం వల్లనే సాధ్యమైనది అని చెప్పక తప్పదు . ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు రాజకీయ పార్టీ శ్రేణులు బారాస నాయకులు రాజకీయ అవినీతికి పాల్పడుతూనే ఉద్యోగ వర్గాలకు కూడా అవకాశం ఇచ్చినారు కనుకనే ఈ రకమైన దోపిడీ యదేచ్చగా కొనసాగింది. బయటపడలేక పోవడానికి ఇదే కారణం . ప్రస్తుత ప్రభుత్వం యంత్రాంగం పైన దృష్టి సారించాలి నిఘా వేయాలి .అనేక విభాగాలలోని ఉన్నతాధికారుల నుండి క్షేత్రస్థాయి వరకు గల ఉద్యోగులందరి లోపాలను కనిపెట్టే క్రమంలో కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే గత తప్పిదాలను సవరించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు అలవాటు పడినటువంటి పిల్లి ఎన్నిసార్లు అయినా తప్పులు చేసినట్లు ప్రస్తుత పరిపాలనలో కూడా మంత్రులు శాసనసభ్యులు ముఖ్యమంత్రినీ కూడా తప్పు దోవ పట్టించే ఆస్కారం ఉంటుంది . అందుకే శాసనసభ్యులు ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మంత్రులు చట్టాల లోతు, వివిధ విభాగాలలో ఉన్నటువంటి పాలనాపరమైన అంశాలు, సాంకేతిక పరమైన సమస్యలు, రోజువారి ఆదాయము ఖర్చు దారి తప్పడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల పైన దృష్టి సారించి అవగాహనను వేగవంతం చేసుకుని పాలన గాడి తప్పకుండ చూడవలసిన అవసరం ఉంది . అంతేకాదు ఇంతకాలం అవినీతిలో కూరుకుపోయినటువంటి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వెనుకాడదు.
ఆ క్రమంలో భాగంగా అధికారులు ఉద్యోగులను కూడా తప్పుదోవ పట్టించే ఆస్కారం రెచ్చగొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. చట్టసభల చర్చలో ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసినట్లుగానే పరిపాలన వక్రమార్గం పట్టేలా తప్పుడు సలహాలు ఇవ్వడానికి కూడా వెనుకాడకపోవచ్చు. ఈ అన్ని విషయాల లోపల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించి నిబద్ధతగా ముందుకు సాగి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన కొనసాగించి రాబోయే కాలంలో విమర్శలకు ఆస్కారం లేకుండా ఇప్పటి నుండే జాగ్రత్తపడవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే తమ నిజాయితీ ఏమిటో ,ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చినారో ప్రజలకు స్పష్టంగా వివరించడానికి ఆస్కారం ఉంటుంది . ఇప్పటికే ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ ఎనలేని ద్రోహం చేసిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ చర్చల సందర్భంగా జరిగిన లోటుపాట్లపైన సుదీర్ఘ ప్రసంగాల వెల్లువను యూట్యూబ్ ఛానల్ లో వినడానికి ప్రజలు ఎక్కువ మొత్తంలో ఆసక్తి కనబరిచినా రంటే పరిపాలన పట్ల, అవినీతి పట్ల, పాలకుల యొక్క నిబద్ధత పట్ల ప్రజలు కూడా నిఘా వేసి ఉన్నారని ప్రభుత్వంతో సహా అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తే మంచిది .
విద్యుత్తు పైన చర్చ సందర్భంగా సిద్దిపేట గజ్వేల్ తో సహా హైదరాబాదు నగరంలో పెద్ద మొత్తంలో బకాయిలు వసూలు కావలసి ఉన్నదని కొన్ని ప్రాంతాలలో నైతే వసూ లు మొత్తానికే జరగడం లేదని రాజకీయ నాయకుల గుండాయిజం దౌర్జన్యాలు పెచ్చు మీరీ వసూళ్లకు ఆటంకము కలుగుతున్నదని పలు సందర్భాలలో మనము ప్రజాభిప్రాయం ద్వారా విని ఉన్నాం . వివిధ విభాగాలలో కానీ ఎక్కడైనా పారిశ్రామిక సంస్థలలో గాని పెట్టుబడిదారుల నుండైనా రావలసినటువంటి ఎలాంటి బకాయిలైన వసూలు చేయడానికి యంత్రాంగాన్ని పురమాయించి ఉక్కు పాదం మోపి ప్రజాధనాన్ని ఇంతకాలం కొల్లగొట్టిన దుర్మార్గులకు శిక్ష పడేలా చూడడంతో పాటు ప్రభుత్వ ఖాతాకు జమ చేసి ఆ ధనాన్ని ప్రజల కోసం వెచ్చి0 చడానికి పూనుకోవాలి. కాలేశ్వరం తో సహా వివిధ ప్రాజెక్టుల్లోని అవినీతిని, ఇతర భూముల అమ్మకాలు, ఉచితంగా పంపిణీ చేసిన ఆన వాళ్లు, కుల సంఘాల పేరుతో ఉచితంగా కట్టబెట్టినటువంటి వందలాది ఎకరాల భూమి పైన కూడా విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది . అప్పుడు మాత్రమే స్పష్టమైనటువంటి నేరస్తులు, చేసిన దోపిడీ, రావలసిన బకాయిలు ఆర్థిక పరిస్థితికి ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది .ఆ పునాది పైన ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలతో పాటు సంక్షేమం అభివృద్ధి విద్య వైద్యం వంటి ప్రధాన రంగాలను ప్రజలకు చేరువ చేసే విధంగా సుపరిపాలన చేయాలని ఆ వైపుగా తగిన చర్యలు తీసుకోక నిబద్ధతను కోల్పోతే ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లి ప్రమాదం ఉంటుందని అంగీకరించాలి. ప్రజలు, ప్రజాప్రతినిదులు, ప్రజా సంఘాలు నిరంతరము ప్రజల ఆకాంక్షలను వివిధ ఉద్యమాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఏ ప్రభుత్వమైనా ప్రశ్నించనిదే ప్రతిస్పందించదు. "పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు అసమానతలు తప్ప"
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సేన ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)