కుక్కల దాడిలో నెమలి మృతి... ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన పోలీసు అధికారులు
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు:కుక్కల దాడిలో జాతీయ పక్షి నెమలి మృత్యువాత పడినఘటన మానవపాడు మండలములో మంగళవారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం... అటవీ ప్రాంతం నుండి గ్రామ పరిసరాల్లో ఆహారం కోసం నెమలి వచ్చినట్లు తెలియజేసారు. మండల లోని చెన్నిపాడు గ్రామ శివారు లో అటవీ ప్రాంతం నుండి నెమలి గ్రామంలోకి ప్రవేశించింది. ప్రవేశించిన వెంటనే ఆ నెమలిని కుక్కలు చూడటంతో వెంటనే నెమలిపై దాడి చేశాయి ఆ ఘటనలో నెమలి మృతి చెందింనది అని గ్రామస్తులు తెలియజేసారు. ఈ సమాచారం చెన్నిపాడు గ్రామస్తులు స్థానిక ఎస్సై కు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్సై వెంటనే స్పందించి గ్రామానికి పోలీసులను పంపించి కుక్కల దాడిలో మృతి చెందిన నెమలిని వెటర్ని హాస్పిటల్ కు అధికారులు తీసుకుని వచ్చారు.ఎస్సై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి వారు వెంటనే వెటర్ని హాస్పిటల్ కు చేరుకొని పారెస్టు అధికారులు నెమలి కళేబరానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖననం చేస్తామని అటవీ శాఖ అధికారి కీర్తి తెలిపారు.