చెక్ పోస్టుల దగ్గర వాహనాల తనిఖీల్లో ఏలాంటి రశీదులు లేని 11,54,200/- రూపాయలు సీజ్
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా సరి హద్దు చెక్ పోస్టు లలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.మంగళవారం ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్లురు చెక్ పోస్టు దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి రశీదులు లేని 11లక్షల రూపాయలు, అలాగే KT దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నందిన్నే చెక్ పోస్టు దగ్గర జరిపిన వాహన తనిఖీల్లో 54 వేళ 2 వందల రూపాయలు సీజ్ చేయడం జరిగిందని వీటిని పంచనామా ఆనంతరం జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసెల్ కమిటీకి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే తగిన రశీదులు ,పత్రాలు వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.