కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి.CITU డిమాండ్
జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల కాంగ్రెస్ పార్టీ ఐకెపి వివోఏ లకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐకెపి వివోఏ (ఉద్యోగుల సంఘం సీఐటీయు అనుబంధం) లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 20వేల రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గ్రామ స్థాయిలో మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసి మహిళా సాధికారత లో ముఖ్య పాత్ర పోషిస్తున్న voa లకు ప్రభుత్వం వెంటనే 20000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే గ్రామ స్థాయిలో voa లు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. అటువంటి voa ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నదని విమర్శించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గ్రామ సంఘం నుండి వేతనం ఇవ్వకుండా క్యాబ్, నెట్ సౌకర్యం కల్పించకుండాపోవడం వల్ల voa లు తమ సొంత డబ్బులతో ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి చేతగానప్పుడు ఎందుకు ఉద్యోగ కార్మికులను మోసం చేసే హామీలు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్తగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిశోర బాలికలకు సంఘాలు ఏర్పాటు చేయాలని అదనపు పని భారాలను మోపుతూ వివోఏ లను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు విఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని, మూడు నెలలకు ఒకసారి వివోఏ రెన్యూవల్ పద్ధతి తీసేసి రెండు సంవత్సరాలకు పెంచాలని, గ్రామ సంఘం నుండి 3000 వేతనం ఇవ్వాలని,అర్హులైన VOA లను సిసిలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తెలంగాణ ఐ. కె. పి. వి.ఓ. ఏ ఉద్యోగుల సంఘం( సీఐటీయు అనుబంధం)నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా సంఘాల తిమ్మప్ప ప్రధాన కార్యదర్శిగా బీసమ్మ కోశాధికారి గా జావీద్ ఉపాధ్యక్షులుగా వెంకట్రామయ్య సహాయ కార్యదర్శిగా వనిత కమిటీ సభ్యులు గా రేణుక, కళావతమ్మ, నవీన,కవితా రాణి, సోమేశ్వరి, నరసింహ, వెంకటేష్ లతో 13 మందిని నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ వివోఏ ల సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాం అంజి, దరూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గద్వాల మండల voa లు పాల్గొన్నారు.