ఒక్క క్షణం మత్తు....నీ జీవితం చిత్తు : ఎస్సై వెంకట్ రెడ్డి

Jan 8, 2026 - 21:47
 0  72
ఒక్క క్షణం మత్తు....నీ జీవితం చిత్తు : ఎస్సై వెంకట్ రెడ్డి

 అతివేగం ప్రమాదకరం ... 

మీ ఇంటిదగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.. 

 ఒక్క ప్రమాదం మీ ఇంటిని చీకటిని చేస్తుంది... 

రోడ్డు భద్రత నియమాలు పాటించండి... 

 

తిరుమలగిరి 09 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి సూచించారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా గ్రామ ప్రజలకు వాహనదారులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్‌ లైసెన్స లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్‌ ఫోన వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతోపాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని ఎస్సై సూచించారు. అనంతరం గ్రామ యువకులతో గ్రామపంచాయతీ నుండి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి ఇటీవల రెండు ప్రమాదాలు జరిగిన సంఘటనలను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అక్కడే మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకన్న సైదులు శివరెడ్డి అంతయ్య గ్రామ ప్రజలు విద్యార్థులు యువకులు వాహనదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి