ఐటీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కుటుంబ సభ్యులతో పాటు సమాజ బాధ్యత కూడా.
ఆ నైపుణ్యముతో అన్ని రంగాలు లబ్ధి పొందుతున్నాయి కదా!
ఊపకా యం కాలేయ జబ్బుల ముప్పు ఉందంటున్న వైద్య నిపుణులు.
ప్రత్యామ్నాయ జీవన విధానమే మంచి విరుగుడు
--- వడ్డేపల్లి మల్లేశం
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంటే ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కల్తీ లేనటువంటి ఆహారం, పోషక విలువలతో, ఇతర రసాయనిక పదార్థాల జాడలేనటువంటి ఆహారం కావడం వలన ఆనాడు గ్రామీణ ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో పట్టణాలతో సంబంధాలు భారీగా పెరిగిన తర్వాత వాతావరణం ఏ రకంగా నైతే కలుషిత మైందో ఆహారము నిద్ర ఇతర జీవన విధానాలు అన్నీ కూడా చెడి పోయి దాని ప్రభావం స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతున్నది. అయితే ఇక్కడ చెప్పదగిన విషయం ఏమిటంటే గత మూడు నాలుగు దశాబ్దాలుగా గమనించినప్పుడు విజ్ఞాన శాస్త్రం విస్తృతస్థాయిలో అభివృద్ధి చెంది దాని పర్య వసానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా తన పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో పేద ధనిక తేడా లేకుండా అర్హత గల చదువుల తర్వాత వారి యొక్క చురుకుదనం, నైపుణ్యం, సృజనాత్మకత కారణంగా ఐటీ ఉద్యోగులుగా ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో నియామకం కావడం అనేది గత రెండు మూడు దశాబ్దాలుగా మనం పెద్ద మొత్తంలో గమనించవచ్చు. కంపెనీలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ విధానాలను కొనసాగించడంతోపాటు, బహుళ జాతి సంస్థల యొక్క ప్రాబల్యం గణ ణీయంగా పెరిగిపోవడం అంతేకాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం వలన కూడా ఇతర దేశాల యొక్క కంపెనీలు భారీగా తరలి రావడంతో ఉద్యోగాల యొక్క అవకాశాలు కూడా పెరుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. వేతనాలలో వారి వారి స్థాయితో పాటు సీనియర్ జూనియర్ గా చూసినప్పుడు చాలా వ్యత్యాసాలే ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అయినప్పటికీ వృత్తి స్వభావరీత్యా 10 12 గంటల పాటు తప్పనిసరిగా ఏక దీక్షతో పనిమీద మనసుపెట్టి ఇచ్చిన ప్రాజెక్టును సఫలం చేయడంలో కష్టపడవలసి రావడంతో ఐటీ ఉద్యోగులకు విశ్రాంతి అనేది లేకుండా పోతున్నట్లు కొందరి అనుభవాల అయిన కొందరి ద్వారా తెలుస్తున్నది. అదే సందర్భంలో వేతనాలు భారీగా ఇస్తున్న కొన్ని కంపెనీలు అయితే అదే స్థాయిలో పని తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భం వేతనాలు తక్కువ ఉన్నప్పటికీ పని తీ సుకోవడంలో మాత్రం వెనుకంజ వేయకపోవడం వలన అనివార్యంగా ఐటి ఉద్యోగుల పైన ఒత్తిడి పడుతున్నట్లు తెలుస్తున్నది. దీనికి ప్రాంతాలు దేశాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల హైదరాబాదులోని సెంట్రల్ విశ్వవిద్యాలయ వైద్య విభాగం ఐటీ ఉద్యోగుల మీద జరిపిన పరిశోధన ద్వారా మనకు ఈ విషయం రూడీ అవుతున్నది. కాబట్టి ప్రాంతాలకతీతంగా వారు అందిస్తున్నటువంటి సూచనలను పాటించడంతోపాటు ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని కూడా అవలంబించడం వలన రాబోయే అనారోగ్య ప్రమాదాలను అరికట్టడంతో పాటు ఊపకాయం లివర్ సమస్యలతోపాటు అజీర్తి సమస్యలను కూడా అధిగమించడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు గుర్తించడం చాలా అవసరం
.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైద్య విభాగం జరిపిన సర్వే ఫలితాలు
ఐటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల పైన పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వడం కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వైద్య విభాగం ప్రొఫెసర్ కళ్యాణ్కర్ మహదేవ్ నేతృత్వంలో ప్రొఫెసర్ అనిత మరి కొంతమంది పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో 2023 జూన్ నుండి 2024 జూన్ వరకు సుమారు 3450 మంది ఐటి ఉద్యోగుల పైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారు కొన్ని నిర్ణయాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. తమ సందేహాలను తీర్చుకోవడంతోపాటు ఆయా ఐటీ ఉద్యోగులకు కొన్ని సూచనలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఈ బృందం ఏఐజి ఆసుపత్రిలోని హేపటాలజిస్ట్ డాక్టర్ పి ఎస్ రావును కలిసి తమ పరిశోధన విషయమై తెలిపి సహకరించవలసిందిగా కోరినప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వారు అంగీకరించినట్లుగా తెలిసింది.ఆ మేరకు సామాజిక మాధ్యమాలు ఇతరత్రా హైదరాబాదులోని షాపింగ్ మాల్స్ అనేక చోట్ల కూడా ప్రచారం నిర్వహించగా వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఐటి ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమే. దాని కారణంగా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కొన్ని సమాధానాలు రాబట్టడంతో పాటు ఊబకాయం ఇతర జబ్బులతో వారు ఇబ్బందులు పడుతున్నారని పరిశోధన ద్వారా తెలిసికొని తమకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం వేణు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఈ క్రింది నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తున్నది.
-- ఐటి ఉద్యోగులలో 84 శాతం మందికి ఊబకాయం ఫ్యాటీ లివర్ తో ఇబ్బందులు పడుతున్నట్లు ఇందులో 5 శాతం మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్లు గమనించినారు.
- ఇక ముఖ్యంగా 71 శాతం మంది యువతలో ఊబకాయం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
-- 34 శాతం మందిలో జీర్ణక్రియ సరిగా లేకపోవడంతో పాటు అదనంగా 10 శాతం మందిలో మధుమేహం ఛాయలు కనపడినట్లుగా వాళ్లు నిర్ధారణకు రావడం జరిగింది.
ఈ పరిశీలన అంశాలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు ఇతర దేశాలలోనూ తరచుగా ప్రయోగ పరీక్షలుకంపెనిలు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిపించడం నిజంగా ఒక సామాజిక భాద్యత కూడా . తద్వారా దీనిలోని శాస్త్రీయతను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది.
పరిశోధన బృందం సూచనలు
********
హైదరాబాదులోని ఐటి ఉద్యోగులకు యాజమాన్యాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అందులో కాలేయ పరీక్షలు లేకపోవడంతో ఆ ముప్పును గ్రహించలేకపోతున్నారని పరిశోధనా బృందం సారథి తెలియజేశారు. అంతేకాకుండా ఫ్యాట్ లివర్ సమస్య ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఊబకాయం కాలేయ జబ్బు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం శారీరకమైన వ్యాయామం తప్పనిసరి చేయాలని తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ధ్యానం ప్రాణాయామం ద్వారా జీవనశైల్లో కొంత మార్పు తీసుకురావడం అవసరమని సూచించినట్టు తెలుస్తున్నది.
ఐటి ఉద్యోగం అనగానే ఇది యాంత్రికమైనటువంటిది అని గంటల తరబడి చేసే ఉద్యోగం అని దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనే మానసిక ఆలోచన కూడా ఆ రకమైనటువంటి అనారోగ్యాలు రావడానికి కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే మానవ సంబంధాలు బలహీనంగా ఉండడం, కేవలం వృత్తికి పరిమితమై మౌనంగా పనిచేయడం, మధ్యలో ఎలాంటి హావభావాలకు ఆస్కారం లేకపోవడం, విశ్రాంతికి తా వులేని పద్ధతిలో ఈ ఉద్యోగం కొనసాగడం కూడా ఈ అసంబద్ధ విధానాలకు కారణమవుతున్నట్లు అంచనా వేస్తూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యాన్ని ఆయా కుటుంబాల యొక్క మనుగడను సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు వైద్యుల సలహా మేరకు కొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించడం చాలా అవసరమని భావన. ఇతర డిపార్ట్మెంట్లో గమనించినప్పుడు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సంబంధాలు ఐటీ విభాగ o లో లేని కారణంగా ఈ రకమైన లోటు కనిపిస్తున్నట్లుగా ప్రభుత్వాలు యాజమాన్యాలు గమనించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. ఉద్యోగులు కూడా తమ కనీస అవసరాలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి చేతిలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు యాజమాన్యాల వద్ద కొన్ని డిమాండ్లను పెట్టి సాధించుకోవడం కూడా ఈ అనారోగ్య ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కొంతవరకు దోహదపడుతుంది.కొన్ని అంశాలు నిర్ధారణ కావడంతో ఆ బృందం తమ పరిశోధనా పత్రాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ జర్నల్ కు పంపించినట్లు తెలుస్తున్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )