మద్యం అలవాటున్న వ్యక్తితెలంగాణా జాతిపిత ఎలా అవుతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూటి ప్రశ్న.
మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో మధ్య నిషేధం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.
లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న బి ఆర్ ఎస్ అధినేత అంటూ ప్రకటన కాదు రూడీ పరచాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణకు అనాదిగా జరిగిన వివక్షత అణచివేత వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని కృషి చేసినటువంటి మహానుభావులు అనేకo. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని ఒక దశలో ముఖ్యమంత్రి అయ్యే సందర్భాన్ని కూడా వదిలిపెట్టుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తనను తెలంగాణ జాతిపిత అనమని ఏనాడు కోరుకోలేదు. సమాజం కూడా ఆ రకంగా పిలవలేదు. తెలంగాణ కోసం తన ఉద్యమ సిద్ధాంతాన్ని, తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాత్రి పగలు విస్తారo గా సమాచారాన్ని జ్ఞానాన్ని సమీకరించి ఉద్యమానికి అందించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా తెలంగాణ జాతిపిత అని అనిపించుకోవాలని కోరుకోలే. కానీ వీరిద్దరికి భిన్నంగా టిఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాల మద్దతుతో ప్రజా ఉద్యమాల పునాది ప్రాతిపదికన ఉమ్మడి సాధన తో సాధ్యమైన తెలంగాణ తన ఒక్కడి వల్లనే లభించినదని గొప్పగా చెప్పుకోవడం దానికి వంత పాడినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు కేసిఆర్ గారిని తెలంగాణ జాతిపిత అని ప్రకటించదాన్ని జీర్ణించుకోలేని అనేకమంది అది ఏనాడో నిరాకరించడం జరిగింది. మహాత్మా గాంధీ కి ఉన్నటువంటి లక్షణాలు మద్యపానానికి దూరంగా ఉండడం వంటి శీలముతో కేసీఆర్ గారిని పోల్చడం అంటే చాలా అవివేకమని మద్యపానంతో సంబంధం కలవాడు ఏ రకంగా తెలంగాణ జాతిపిత అవుతాడని రాష్ట్ర ముఖ్యమంత్రి కి రేవంత్ రెడ్డి గారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగిన సభలో మాట్లాడడాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ప్రజాధనాన్ని సుమారు లక్ష కోట్లు దోచుకున్నాడని పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి బ్రష్టు పట్టించినారని అందువల్ల తమ ప్రభుత్వం ఇప్పటికీ గత 14 మాసాల లోపల 1,54,000 కోట్లు మిత్తి కిస్తులకు చెల్లించవలసి రావడం జరిగిందని తద్వారా రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోవడానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని విమర్శించడం కూడా ప్రజలందరూ ఆలోచించాలి .అనేక సందర్భాలలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో కూడా కేసీఆర్ గారు లక్ష కోట్ల అవినీతికి పాల్పడినాడని ప్రకటించడం జరిగింది. అంతేకాదు బిజెపి జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి, ఆనాడు ఉన్నటువంటి జాతీ య అధ్యక్షులు కూడా కెసిఆర్ గారు అవినీతికి పాల్పడినారని, కాలేశ్వరం ప్రాజెక్టు వారికి ఏటీఎం లాగా మారిందని అనేక సందర్భాలలో ప్రకటించినప్పటికీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం లోని ఆంతర్యం ఏమిటి? అంటే ప్రజాధనాన్ని ఎవరిష్టం ఉన్నట్లు వాళ్లు కొల్లగొడుతూ ఉంటే కేవలం పరస్పర ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చితే నిజంగా ప్రజల సంపద దుర్నియోగం కావాల్సిందేనా? నేరస్తులను గుర్తించి, చట్టానికి అప్పగించి, జరిమానా విధించి, కొల్లగొట్టిన సంపదను ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం లేదా ప్రజలకు పంపిణీ చేయడం జరగాలి. ఆ ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సందేహాన్ని వెళ్లబుచ్చుతున్నారు కూడా.
పదేళ్ల పాలనపై సమగ్ర విచారణ ఎందుకు లేదు
************
ఫోన్ టాపింగ్, గోర్లు మేకలు చేపల పంపిణీలో అవినీతి అని నీటిపారుదల పథకాలలో ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతి పనిలోనూ నాణ్యత లేకుండా అవినీతికి పాల్పడిందని అనేక సందర్భాలలో ప్రకటించినా రే తప్ప సమగ్రమైన విచారణకు ఆదేశించినది లేదు. ప్రజల సొమ్ము దుబారా జరిగితే అంత సీరియస్ ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు లేదు అర్థం కావడం లేదు. ప్రజలకు ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ప్రభుత్వo టిఆర్ఎస్ పార్టీని కాపాడడానికి ప్రయత్నిస్తున్నదా అని కొందరు తమ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
అవును కెసిఆర్ గారు నిజంగా తెలంగాణ జాతిపిత కారు అనడంలో సందేహం లేదు అలాంటప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు ఆ విషయం పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చ జరిపి ముఖ్యంగా బుద్ధి జీవులు మేధావులతో సమాలోచన చేసి తెలంగాణ జాతిపిత ను నిర్ణయించవలసిన అవసరం ఉంది.అప్పుడు కానీ పదేపదే కేసీఆర్ గారిని జాతిపిత అని పిలవడం ఆగదు.వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించి ప్రతి అంశం పైన పూసగొచ్చినట్లుగా విస్తృత స్థాయిలో తనిఖీ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం మొక్కుబడిగా సిబిఐ ఈడి సిఐడి విచారణ పేరుతోనే కాలయాపన చేయడం ఆ తర్వాత బి ఆర్ ఎస్ నాయకులు మళ్లీ ప్రభుత్వాన్ని ఇష్టమున్నట్లుగా విమర్శించడం బహుశా అవిమర్ష లకు భయపడి కాబోలు ప్రభుత్వం విచారణను మరిచిపోవడం ఈ మధ్యన ప్రజాధనం దుర్వినియోగం కావడం నిజంగా ఇది సహించరా నటువంటి నేరం .స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా సంపదకు పాలకులు కేవలం కావలి కుక్కలు మాత్రమే అని అనేక సందర్భాలలో ప్రకటిస్తే మిగతా రాజకీయ పార్టీలు మేము సేవకులం కాపలాదారులం అని ప్రకటించిన సందర్భాలు కూడా అనేకం. మాటలు అంత తీయగా మాట్లాడి చేతల్లో మాత్రం ప్రజల సంపదను దోపిడీ చేస్తే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని తెలుసుకోవడం అవసరం. ప్రభుత్వం కూడా మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించడంలో అర్థం ఉంది కానీ మద్యపానం నిషేధించినటువంటి మహాత్మా గాంధీ రాష్ట్రం ని ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు మరిచినట్లు. ప్రభుత్వం సుమారు 26 వేల మద్యం షాపులు 12వేల బార్లకు అనుమతించి ఆదాయం కోసం పాకలాడుతున్నదే కానీ ప్రజల యొక్క అవస్థలు అనారోగ్యము జరుగుతున్న సామాజిక రుగ్మతలు అసాంఘిక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ఏర్పడిన విష పరిణామాలను సరి దిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించకపోవడం అంటే మహాత్మా గాంధీ పేరు ఉచ్చరించినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? పాలకులు ఆలోచించుకోవాలి. అనేక సందర్భాలలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల పైన విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా ప్రజల ముందు వినయంగా ప్రవర్తించడం మాని పాలకులను ఇష్టారాజ్యంగా నిందించడం అంటే ఈ రాష్ట్రంలో నిజాయితీతో కూడుకున్న విచారణ ఉందా లేదా అని అనుమానం రాక మానదు. ఒకవైపు నేరస్తుడని కోర్టులు సిబిఐ సిఐడి వంటి సంస్థలు ప్రకటిస్తూ ఉంటే మరొకవైపు ర్యాలీలు ప్రెస్ మీట్ లు పెట్టుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచినట్లేనని చెప్పక తప్పదు. అయితే అవినీతిపైన విచారణ అనేది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే కాదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో తన కాలంలో అవినీతి చర్యలకు పాల్పడితే తిరిగి విచారణ ఎదుర్కోక తప్పదు అని కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రజలే ప్రభువులు ప్రజలే అధినేతలు ఏ కాలంలోనైనా పాలకుల యొక్క అవినీతిపైన విచారణ జరిపించడానికి ప్రజల ఒత్తిడి తప్పకుండా అవసరం. ఈ విషయం లోపల భారత సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాలు సంఘటనల్లో ముఖ్యమైన నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, ప్రకటించిన సందర్భాలను సుమోటోగా స్వీకరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి రాజకీయ నాయకులను బజారుకీడ్చి ప్రజల ముందు బోనులో నిలబెట్టి తగిన శిక్ష వేయాల్సిందే. జరిమానాలు విధించి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సిందే. ఆ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండాల్సిన అవసరం లేదు.ఆ రకంగా జరిగితే రాబోయే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది, చర్యలు లేకుంటే అవినీతికి పాల్పడడంలో పోటీపడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ప్రజా పోరాటాలు పాలకుల యొక్క అవినీతి పైన ఉద్యమాలు పెద్ద ఎత్తున రావలసినటువంటి అవసరముంది ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు లేనంత కాలం న్యాయ వ్యవస్థ కూడా అంత ముందుకు సాగలేదేమో? ఎందుకంటే అనేక చోట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి కనుక. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను స్టేషన్ ఘనపూర్ లో మాట్లాడినటువంటి మాటలను నిజం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )