ఐకెపి మహిళ సంఘాల ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

Nov 15, 2025 - 19:35
 0  1

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి  అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు  ప్రారంభించారు. రైతులు పండించే వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా, లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333