ఐకెపి ధాన్యం కేంద్రాన్ని పరిశీలన

Apr 10, 2025 - 18:27
 0  4
ఐకెపి ధాన్యం కేంద్రాన్ని పరిశీలన

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు

తెలంగాణ వార్త వేములపల్లి ఏప్రిల్ 10 : వేములపల్లి మండల కేంద్రంలో ఆమునగలు గ్రామం నందు ఈరోజుతెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఐకెపి కేంద్రంలోని ధాన్యాని సందర్శించి పరిశీలించారుగురువారం మండలంలోని సల్కునూరు ఐకెపి కేంద్రాన్ని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, సీనియర్ నాయకులు కనకయ్య మద్దిరాల రంగారెడ్డి,లతో కలిసి పరిశీలించారుఐకెపి ధాన్యాన్ని రాసులుగా పోసి రోజులు గడుస్తున్నకాంటాలు వేయకుండా కాలయాపన చేయడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారువర్షం వస్తే ఐకెపి కేంద్రంలోని ధాన్యం అంతా తడిస్తే నష్టపోయేది రైతులేనని అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదని అన్నారురాశులపై ఎలాంటి రక్షణ లేకుండా పుట్లకొద్ది ధాన్యం ఎడారిలో పడిఉన్నా కాంటా వేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరని ప్రశ్నించారు ఐకెపి కేంద్రంలో పోసిన ధాన్యం అనుకోకుండా వర్షం వచ్చి  రైతు నష్టపోకుండా ఉండాలంటే వెంటనే కాంటాలు వేయించలనిఅన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు మద్దిరాల రంగారెడ్డి ,మద్దిరాల వెంకటరెడ్డి ,రైతులు రోశయ్య ,సత్యం, సైదులు, చిటికెల యశోద ,లింగమ్మ ,లక్ష్మమ్మ ,కళమ్మ, రేఖ, ఎల్లయ్య, గురజా రాణమ్మ, రేఖ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333