కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్*డాక్టర్ .పి .పెంటయ్య

Sep 13, 2024 - 09:40
Sep 13, 2024 - 09:46
 0  6
కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్*డాక్టర్ .పి .పెంటయ్య

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషద బ్యాంకు 

 పశు ఔషద బ్యాంకు తో నోరులేని పశువులకి ప్రాణదానం - ఔషద దాతలకు ఎనలేని పుణ్యం 

- పశు ఔషద బ్యాంక్” పశువుల మందుల బ్యాంక్ ( యానిమల్ మెడిసిన్ బ్యాంక్ ) -వనడానికి కొత్తగా

– ఔషద పెట్టుబడితో మూగాజీవాలకి ప్రాణదానం చేసినవారికి పుణ్యం.

సమయానికి పశువులకి అవసరమైన మందులతో మెరుగైన పశుఅరోగ్యం –

ఆరోగ్యకరమైన పాలు, గుడ్లు మాంసం ఉత్పతి –

పశు ఉత్పత్తులు ఆరగించే ప్రజారోగ్యం మరింత మెరుగు.

 చాలా మంది తమ భక్తి ,వ్యాపకం మరియు సేవా దృక్పథంతో తమకు తోచిన విదంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగానే ముగజీవాల పై ప్రేమతో దేవాలయల్లోకి వెళ్ళినప్పుడు భక్తి ప్రేమలతో అక్కడి గోశాలల్లో ఆవులకి పచ్చి గడ్డి , దాణా కొనుగోలు చేసి , మేతగా అందిస్తూ ఆద్యాత్మిక త్రుప్తి పొందుతుంటారు. 

పట్టణాల్లో ఉదయం పశువులు తమ ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు పూజలతో పాటు తవుడు , బియ్యం దాణా అరటిపండ్లు అందిస్తూ చాలా మంది తమ భక్తీ సేవల తో త్రుప్తిపొందుతుంటారు.

అదేకోవలో ఆలోచిస్తే పశువులు అనారోగ్యం భారిన పడినప్పుడు వాటికి కావలసిన అత్యవసర మందులు (ఔషదాలు) అందించడం కుడా ప్రస్తుత పరిస్థితుల్లో మరింత మేలు చేసేదిగా ఉంటుంది అనే ఆలోచనతో దాన్ని కార్యరూపం లో పెట్టి తనే తొలి వితరణ పెట్టుబడితో 17౦౦ దూడలకి సరిపోవు ఇప్సం సాల్ట్ ( మేగ్నిషిం సల్ఫేట్) 50 కిలోలను పశు ఔషద బ్యాంక్ నకు అందించి పశు ఔషధ బ్యాంక్ సేవలు అమల్లోకి తీసుకురావడం అభినందనీయం .

వివరాల్లోకి వెళితే కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్య శాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డా.పి.పెంటయ్య మాటల్లో పశుపోషకులు అంటేనే మెజారిటీగా భూమిలేని నిరుపేదలు , వ్యవసాయ కూలీలు మరియు సన్న చిన్నకారు రైతులు. వీరంతా తమ జీవనాధారం కోసం పశువులని పోషిస్తూ ఉంటారు. ఒకప్పుడు మనుష్యుల్ని పెట్టి పెద్ద మందల్ని సాకిన పెద్ద రైతులు కాలక్రమేనా కనుమరుగవుతున్నారు. వారికి వయస్సు పైపడడం వారి పిల్లలు చదువులకి ఉద్యోగాలతో బిజీగా ఉండడం కొందరికి ఆసక్తి లేక పోవడం తో చేసే వారు లేక పశుపోషణ నుండి బైటకు వచ్చారు . రెక్కాడితే కానీ డొక్కాడని వారు, కుటంబ పోషణకి అదనపు ఆదాయం కోసం కొందరు, తరతరాలుగా పశుపోషణ వ్రుత్తిగా కొనసాగుతున్న వారు మరికొందరు , వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసే వారు కొందరు మాత్రం మేతకు బీడు భూములు కనుమరుగైపోయినా ,ఉన్న అరకొర సౌకర్యాలతో పశుపోషణ కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు పంట తీసుకొని గడ్డిని మేతగా నిల్వచేసుకుని మేపే పరిస్తితుల నుండి వ్యవసాయంలో యాంత్రికరణతో గ్రాసం కరువై నేడు కేజీ 10 రూపాయల పైన పెట్టి కొనుగోలు చేసి పశువులకి ఇవ్వాల్సిన పరిస్థితిలో సైతం వారు వ్యయప్రయాల కోర్చి , మన రోజులో ఉదయం లేవగానే మనకున్న అలవాట్లలో టి కాఫీ మొదలు కొని మనకి మనకి కావాల్సిన పాలు పాల పదార్దాలు మరియు ఇతర పశు ఉత్పతుల ఆహారం అందిస్తున్నారు.  

“””’’చికిత్సకన్నా నివారణ మేలు అన్న సామెత ఎంతనిజమో ,ప్రజారోగ్యానికి ప్రజా వైద్యం కన్నా పశువైద్యం కూడా అంతే ముఖ్యం అన్నది కూడా అంతే సత్యం. నూటికి 98.87 ప్రజలు పాలు ,పెరుగు , మజ్జిగ మాంసం గుడ్లు ఎదో ఒక రూపంలో పశు ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నాం . పశువులు ఆరోగ్యంగా ఉంటేనే అవి ఇచ్చే ఆహరం ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడే అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న నిజాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది .అలాగే జంటు ప్రేమికులు ఉల్లాసం మరియు మనోవికాసం కోసం తోడుగా వివిధ రకాల కుక్కలు పిల్లులు పక్షుల్ని సైతం పెంచుతూ రోజువారీపనిఒత్తిడినుండి ఉపశమనం పొందుతున్నారు.

అనేక కారణాల వలన ప్రభుత్వ పరంగా సకల మందులు పశువుల వైద్యానికి సదా అందుబాటులో ఉంచడం సాద్యం కాదు . అవసరం అయినప్పుడు నిరుపేదలు చిన్న సన్న కారు రైతులు ఔషదాలకు డబ్బు వెచ్చించలేని పరిస్థితి ఉంటుంది .అలాంటి సమయములో వారికి చేయూతనిస్తూ మూగజీవాలకు ప్రాణదానం అందించడానికి ఈ “ పశు ఔషద బ్యాంక్ ఉపయోగపడుతుంది.

అలాంటి ఉద్దేశంతోనే తొలిసారిగా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషద బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. తోలి ఔషద పెట్టు బడిగా దూడలు అధికంగా పుట్టే ఈ సీజన్ లో దూడల జీర్ణ సంబంద సమస్యను తీర్చే 50 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ( ఇప్సం సాల్ట్) ని డా పి పెంటయ్య , అసిస్టెంట్ డైరెక్టర్ అందించడం జరిగింది. 

ఈ ఔషద బ్యాంక్ సంబంధించి ప్రత్యెక రికార్డు నిర్వాహిస్తూ తేది వారిగా ఎవరు ఎప్పడు ఏ ఔషదం అందించారు , అది ఎవరికీ ఎప్పడు వాడడం జరిగింది వివరములు నిర్వహిస్తూ నెలవారిగా వివరాలు ప్రాంతీయ పశువైద్య శాల లో ప్రదర్శించబడును. తద్వారా సందర్షుకుల్లో ఔత్సాహికులు మరింతగా భాగస్వాములవ్వడానికి ఆస్కారముంటుంది.

సేవాదృక్పథం కలవారెందరో నిత్యం ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, వివిధ సందర్బాలలో అన్నదానం అంటూ అందరికి బోజనాలు కూడా పెట్టిస్తుంటారు .. అదే సేవా స్పూర్తితో మూగజీవాల పరిరక్షణకి ఔషద దానం సైతం మరింత పున్యం వస్తున్దనడంలో ఎలాంటి సందేహం లేదు.

కోదాడ పట్టణ పశుపోషకుల పశువులకి ఉపయోగార్దం తొలిసారిగా ప్రాంతీయ పశువైద్యశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పశు ఔషద బ్యాంక్ ద్వారా మూగ జీవాల సేవతో ఆత్మసంతృప్తి పొందడానికి, అవకాశం ఆసక్తి గలిగిన దాతలు ప్రాంతీయ పశువైద్యశాల ఆవరణలో పేర్కొన్న ఔషదాల జాబితాలోని పశు ఔషదాలను వితరనగా అందింఛి పశు ఆరోగ్యం లో భాగస్వాములవుతూ పశుపోషకులకు చేయుతనిస్తూ ఆరోగ్యకరమైన పశుఉత్పత్తుల సాధనతో సమాజానికి మెరుగైన ప్రజారోగ్యం అందింఛి పుణ్యంతో పాటు ఆత్మతృప్తి పొందవలసినదిగా విజ్ఞప్తి చేయనైనది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State