చౌళ్ళరామారం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి 

ప్రారంభించిన ఎస్సై నాగరాజు  

Mar 28, 2025 - 19:47
 0  75
చౌళ్ళరామారం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి 
చౌళ్ళరామారం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి 

అడ్డగూడూరు 28 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్;- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామంలో రాముల వారి గుడి దగ్గర 21000/- రూపాయల విలువగల సిసి కెమెరాలను గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి శకుంతల ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అడ్డగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఎస్సై నాగరాజు  మాట్లాడుతూ..గ్రామంలో శాంతిభద్రతలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మెట్టు భాస్కర్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు తోట భాస్కర్ రెడ్డి, కురాకుల జయమ్మ, బిఆర్ఎస్ నాయకులు తోట కృష్ణారెడ్డి, ఆవిరెండ్ల యాదయ్య,గ్రామస్తులు కొమ్మిడి జ్యోతి, తోట సోమలక్ష్మి, కమ్మంపాటి నరేందర్ గౌడ్, మనికాంత్ రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333