ఏపూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం

Jun 21, 2025 - 21:41
 0  70
ఏపూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరు నందు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేకమైన యోగా దుస్తులు ధరించిన . విద్యార్థులకు యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూనే యోగ మరియు ఆసనాలు, ధ్యానం మొదలైనటువంటి కార్యక్రమాలను విద్యార్థుల చేత నిర్వహించడం జరిగిందని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఎండి భాసిత్ గారు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లింగాల రవి విద్యార్థుల చేత యోగాసనాలు వేయించడం జరిగింది దీనిలో ప్రాణాయామాలు యోగాసనాలు, సూర్య నమస్కారాలు ,యోగా డాన్స్ మొదలైనవి విద్యార్థుల చేత ప్రాక్టీసు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం అలాగే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు వీరిలో రమణ, వేణు, పుష్పకుమారి, పబ్బతి వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ చెరుకు శ్రీను, వెంకటేష్ ,నాగేందర్ విజయ, విజయ్ కుమార్, నగేష్, మోహన్ ,వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ,రేణుక, హేమా, సైదులు శాస్త్రి, నవీన్ మొదలైన వారు పాల్గొన్నారు