ఏందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల 08 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో రామాపురం గ్రామానికి చెందిన ఆకుమర్తి దొరబాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలా ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అండగా నిలవాలని, దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి ఆశ్రమం నిర్వాహకులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ రావు,సుందర్,నాగరాజు, ఉపేందర్, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు