ఎల్ బి స్టేడియంలో జరిగే వికలాంగుల మహాగర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలి!

గుండాల 26 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆగస్టు13న జరగబోయే పెన్షన్ దారుల మహా గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలి వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ అందరూ తప్పక హాజరుకావాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు, వయోవృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలకు,చేనేత,బీడీ పెన్షన్ దారులందరికి పెన్షన్ పెంచాలని డిమాండు చేస్తూ ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో జరగబోయే పెన్షన్ దారుల మహా గర్జనకు ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో రావాలని జిల్లా వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ పిలుపునిచ్చారు