ఎమ్మెల్సీ రమణ కు చాంద్ పాషా ఆటో బయోగ్రఫీ పుస్తకం అందజేత

చాంద్ పాషా ను అభినందించిన ఎమ్మెల్సీ రమణ 

Nov 21, 2024 - 17:43
 0  1
ఎమ్మెల్సీ రమణ కు చాంద్ పాషా ఆటో బయోగ్రఫీ పుస్తకం అందజేత

గల్ఫ్ పోరాటంలో ఎల్.రమణ చేయూత,డాక్టర్ చాంద్ పాషా..గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటం లో ఎమ్మెల్సీ ఎల్.రమణ తనకు అండగా నిలిచారని డాక్టర్. చాంద్ పాషా అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎల్ రమణను ఆయన నివాస గృహంలో కలిసి
చాంద్ పాషా 20 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల సమస్యల సదన కోసం, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని  చేసిన పోరాటం తో పాటు గల్ఫ్ ఎజెంట్ల్ మోసాలను బట్టబయలు  చేసిన పోరాటం ఎదుర్కొన్న సమస్యలు  వివరిస్తూ రచించిన ఆటో బయో గ్రాఫి పుస్తకాన్ని ఎల్ రమణ కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ చాంద్ పాషా ను అభినందించారు.

చాంద్ పాషా జీవితం స్ఫూర్తిదాయకం అని అన్నారు.

అనంతరం చాంద్ పాషా మాట్లాడుతూ  


గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని దుబాయ్ నుండి తాను లేఖ రాశానని అన్నారు.

 స్థానికంగా  ఎల్ రమణ  కలెక్టరేట్ ముట్టడి చేసి ధర్నా చేశారని గుర్తు చేశారు.


దీంతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేయగా  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుబాయ్ నుంచి వెనుతిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్న 29 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

నిజాంబాద్ లో 17 మందికి కరీంనగర్ లో 8 మందికి ఆదిలాబాద్ లో ముగ్గురికి, మెదక్లో ఒకరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.


2009 లో గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు  చేసినా,

 ప్రభుత్వం టిఆర్ఎస్ లో పాలనలో ఎన్నారై బోర్డు ఆర్థిక సహాయం అమలు కాలేదని అన్నారు.

గల్ఫ్ బాధితుల పక్షాన తాను రూపొందించిన నివేదికను ఎల్ రమణ, కొప్పుల ఈశ్వర్ లకు అందజేశానని తన నివేదికలోని అంశాలను అసెంబ్లీలో చర్చకు పెట్టారని గుర్తు చేశారు.

గల్ఫ్ బాధితుల తరఫున రెండు దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నానని తన పోరాట ఫలితంగా గల్ఫ్ బాధితులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జీవో జారీ చేశారన్నారు.


ఉపాధి కోసం భారతదేశన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లిన అందరికీ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు.

రాజ్యసభ సభ్యులు సురేష్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెల్లాగా, పార్లమెంట్లో  గల్ఫ్ బాధితుల పక్షాన మాట్లాడతానని హామీ ఇచ్చారని అన్నారు.


విజిట్ లో వెళ్లి మృత్యువాత పడిన వారికి సైతం పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ చాంద్ పాషా కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333