వేలకోట్లు వెచ్చేంచి కలెక్టర్ భవనం

May 12, 2025 - 19:34
 0  9
వేలకోట్లు వెచ్చేంచి కలెక్టర్ భవనం

మండుటెండల్లో పార్కింగ్..

పార్కింగ్ షెడ్యూస్ లేక చెట్లే అవసం....

ప్రజావాణికీ వచ్చే ఫిర్యాదు దారుల వాహనాలు మండుటేండల్లో...

జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలు ఏర్పాటు చేయగా అందులో జోగుళాంబ గద్వాల జిల్లా 2016 సంవత్సరంలో ఏర్పాటు కాగా కాలక్రమేణా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం వేలకోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు.అన్నీ హంగులతో నిర్మాణం చేపట్టిన కొన్ని లోపాలు మాత్రం స్పష్టంగా కన్పిస్తున్నాయి.విశాలంగా గదులు గార్డెన్, జాతీయజెండాతో కలెక్టర్ కార్యాలయ భవనం హుందగా కన్పిస్తున్నప్పటికి ప్రతి సోమవారం సమస్యలతో ప్రజావాణికీ వచ్చే వాహనదారుల బండ్లు మాత్రం పార్కింగ్ నీడ లేక చెట్లు క్రింద మండుటెండల్లో వాహనాలను పెట్టి కాలం వెళ్ళాతిస్తున్నారు..వేసవికాలం అధిక తాపం వేడిమికి అనుకోని ప్రమాదం సంభవిస్తే దానికి బాధ్యులు ఎవరన్నాది ఆలోచన చెయ్యాలని వాహనదారులు వాపోతున్నారు..కనీసం ఈ మూడు మసాలలో రెండు మాసాలు పూర్తిగా కాగా ఈ మాసంలో అధికాతాపం ఉండటం వల్ల చలువ పందిళ్ళు వేస్తె కోద్దిగైన ఉపశమనం కల్గుతుందాని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333