ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన""శ్రీ తొండపు దశరథ జనార్ధన్

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన
*తొండపు దశరథ జనార్దన్* గారు
కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మరియు జయప్రద ఫౌండేషన్ చైర్మన్
శ్రీ *తొండపు దశరథ జనార్దన్* గారు, తెలుగు సినీ పురుషుడిగా, నాయకుడిగా ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నందమూరి తారక రామారావు గారి తనయుడు రామకృష్ణ గారు కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి ఆదర్శాలను, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను స్మరించుకుంటూ, వారిద్దరూ సంయుక్తంగా ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భం ప్రజల మధ్య ఎన్టీఆర్ గారి పట్ల గల గౌరవాన్ని మరింతగా ప్రతిబింబించింది. దశరథ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి సేవలను గుర్తుచేసుకుంటూ, తమ రాజకీయ ప్రేరణకు ఆయన జీవితం మార్గదర్శకమని పేర్కొన్నారు.