ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మద్యపానం ధూమపానం డ్రగ్స్ పై ప్రదర్శన

Aug 1, 2025 - 20:31
 0  0
ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మద్యపానం ధూమపానం డ్రగ్స్ పై ప్రదర్శన

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  నేమ్మికల్ సంతలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రాచకొండ ప్రభాకర్ సామాజిక కార్యకర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఊపిరితిత్తులు ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుటకు ప్రధాన కారణమైన ధూమపానము,సిగిరెట్, బీడీ గుట్కా,పొగాకు ఉత్పత్తులను సేవించడం వలననే, కావున ఈ సందర్భంగా యువతకు ప్రజలకు సమాజానికి బీడీ సిగరెట్, గుట్కా, పొగాకు పదార్థాలకు ధూమపానానికి దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, క్యాన్సర్ బారిన పడవద్దని ఫ్లెక్సీలు కరపత్రాలు మైక్ సెట్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.