దారి ఇలా పోయేది ఎలా
సీసీరోడ్డు వేయమంటే.. రాళ్లతో కూడిన మట్టి పోశారు
మరింత అద్వానంగా మారిన టీచర్స్ కాలనీ దారి
దారిలోని రాళ్లను తొలగించి చదును చేయకపోతే కలెక్టర్ కు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేస్తాం
షాద్ నగర్ మున్సిపాలిటీ టీచర్స్ కాలనీలో సీసీరోడ్లు లేక గుంతల మయంగా మారిన దారితో కాలనీవాసులు నరకయాతన పడుతుంటే మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా రాళ్లతో కూడిన మట్టిని పోశారని దీంతో కాలినడకన పోయేవారికి వాహనదారులకు మరింత ఇబ్బందిగా మారిందని కాలనీవాసులు మండిపడుతున్నారు. గుంతలను పూడ్చాల్సింది పోయి రాళ్ళ తో కూడిన మట్టిని పోయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దారిలో గుంతలున్న వెళ్లే వాళ్ళం కానీ బండరాళ్లు వేసి నడవకుండా చేశారని వాపోతున్నారు. తక్షణమే బండరాళ్లను తొలగించి దారిని బాగు చేయాలని, లేకపోతే కలెక్టర్ కు, జిహెచ్ఎంసి కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని కాలనీవాసులు చెబుతున్నారు