ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి ఎంఈఓ
జోగులాంబ గద్వాల 6 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎస్ఎస్సి విద్యార్థులు ఇప్పటి నుంచే మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. విద్యార్థులకు తగు సూచనలు ఎంఈఓ రవీంద్రబాబు ధరూర్ : మండల పరిధిలోని మార్లబీడు ప్రాథమిక పాఠశాలను ప్రార్థన సమయంలో సందర్శించడం జరిగింది. ప్రతి ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేయాలని తెలియజేయడం జరిగింది. జడ్.పి.హెచ్.ఎస్ మార్లబీడు ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులు అందరు ప్రతిరోజు హాజరవుతూ ఇప్పటినుంచే మంచి ఫలితాలు సాధించడానికి చదువు కోవాలని విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 100% ఫలితాలు సాధించడానికి మరియు మంచి మార్కులు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ శివకుమార్ కూడా పాల్గొన్నారు. చిన్నారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల కూడా సందర్శించి విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నందున విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది.