కేంద్రంతో సంబంధం లేకుండా..రైతు పండించిన ప్రతి గింజను కొనాలి

Jun 21, 2026 - 19:23
 0  1
కేంద్రంతో సంబంధం లేకుండా..రైతు పండించిన ప్రతి గింజను కొనాలి

కేంద్రంతో సంబంధం లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిందేనని..లేని పక్షంలో ఉద్యమించి రైతు పక్షాన నిలబడి ప్రభుత్వ మెడలు వంచుతామని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ అన్నారు.ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్,మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్,ఎద్దుల నగేష్ తో పాటు..బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రం ఎంత కొంటే రైతుల వద్ద తాము అంతే వరి ధాన్యమును కొంటామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొననందుకు..రెండు నెలల పాటు కల్లాల వద్ద ఉండి అవస్థలు ఎదుర్కున్నారని కొందరి పంటలు వర్షానికి తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.బోనస్ ను ఎగ్గొట్టడానికి పండించిన వరి పంటను ప్రభుత్వం సకాలంలో కొనలేదని ఆరోపించారు.గత సీఎం కేసిఆర్ గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన రైతులు పండించిన ప్రతి గింజను కొన్నారని..అదే స్ఫూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనాలని డిమాండ్ చేశారు.మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు దాటిన..ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఖడ్గే గార్ల సాక్షిగా ప్రకటించిన 6 గ్యారంటీలు,420 గ్యారెంటీలను నేటి వరకు అమలు చేయలేదని అన్నారు. రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టారని,రైతు బీమా ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతు బీమాకు పంగనామం పెట్టారని,విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అందించకుండా..మోసం చేశారని..దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లు రాక అవస్థలు ఎదుర్కొంటున్నారని..పై చదువులకు వెళ్లలేక వారి బతుకులు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కెసిఆర్ గారి హయాంలో 90 శాతం పనులు పూర్తయిన..పాలమూరు ప్రాజెక్టుతో పాటు..పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా కొత్తకోట మండల వరదాయిని.. వనపర్తి,కొల్లాపూర్ కు సాగునీరు,త్రాగునీరు అందించే శంకర సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి..నిర్వాసితులకు బకాయిపడ్డా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు,సింగిల్ విండో డైరెక్టర్లు,మాజీ కోఆప్షన్ సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు,BRS శ్రేణులు* పాల్గొన్నారు.అనంతరం పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త..ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 14వ వర్ధంతి వేడుకల సందర్భంగా..ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి..తెలంగాణ రావడానికి విద్యావంతుల వేదికను తయారుచేసి.. ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలిచి..వారు చేసిన కృషిని..త్యాగాన్ని గుర్తు చేసుకుని..ఘన నివాళి అర్పించారు.????????

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333