ఉచిత బస్సు ప్రయాణంతో సామాజిక న్యాయం సాధ్యమా?

Sep 7, 2025 - 20:50
 0  2

ఉచిత బస్సు ప్రయాణంతో సామాజిక న్యాయం సాధ్యమా? సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తూ పాలనకు నిధుల కొరత ఆటంక o కాగా విమర్శలను అధిగమించడం ఎలా? ఉచిత బస్సు సౌకర్యంకంటే విద్య వైద్యాన్ని ప్రజలు, మహిళలు డిమాండ్ చేయడాన్ని ప్రభుత్వం ఆలోచించాలి.*

*****-*-*************************--

-- వడ్డేపల్లి మల్లేశం 90142 0641 2

--01....09...2025*****************

సంక్షేమ రాజ్యం అనే పదానికి విస్తృత అర్థాలను కూడగట్టి ప్రజలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కోట్లను సాధించుకోవడమే లక్ష్యంగా పాలక పక్షాలు పోటీపడుతున్నాయి ఆ క్రమంలో ఉద్భవించినవే ఉచిత పథకాలు. సంపదను పెంచడం సంపదను ప్రజలకు పంచడం, సమృద్ధిగా దొరికే ముడి సరుకు నుండి ప్రత్యామ్నాయ వనరులను తయారు చేయడం ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందించే పనికి బదులుగా ప్రజా సంపదను కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వాలు వాగ్దానాలు హామీలకు తెర తీసిన సందర్భం మనకు తెలుసు. ఈ క్రమంలో అనేకమంది అర్హులైన వాళ్లు జాతి సంపదను అనుభవించడానికి నోచుకోవడం లేదు ఇదంతా ప్రభుత్వాల యొక్క అసంబద్ధ కార్యకలాపాల ఫలితమే అని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు వివిధ రకాల పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది అంతకు మించిన స్థాయిలో ఆదాయం వనరులను అర్హులైన వాళ్లకు పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించాలి. కానీ దానికి బదులుగా అలంకార ప్రాయమైన పథకాలను ప్రవేశపెట్టడం వలన ప్రభుత్వ సంపదకు చిల్లులు పడుతున్నవి. కర్ణాటక రాష్ట్రంలో మొదలు ప్రారంభమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆ తర్వాత 2003 నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడమే తడవుగా 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం లో మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలోని 47 డిపోలలో 341 బస్ స్టేషన్ల ద్వారా ఇప్పటివరకు 200 కోట్ల టికెట్లను ఉచితంగా మహిళలకు జారీ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉంటే ఆ టికెట్ల సొమ్ము 6700 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లించినట్లుగా తెలుస్తున్నది. 

        పా లనకు నిధుల సమీకరణ ముఖ్యం:

************************************* 

ప్రతి ఏటా సుమారు 5000 కోట్ల రూపాయలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద ప్రభుత్వం చెల్లించవలసి రావడం అంటే ఇతర రంగాలలో కోత పెట్ట వలసి ఉంటుంది. ఇప్పటికే సుమారు 7 లక్షల కోట్లకు పైగా అప్పుతోని ఏర్పడిన ఈ ప్రభుత్వం అప్పును తే ర్పడానికి మిత్తి చెల్లించడానికి కోట్ల రూపాయలు సమీకరించుకోవడం ఒకవైపు ఇబ్బందిగా మారి మరొకవైపు మహిళలకు 2500 రూపాయలు మిగతా ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శ చేస్తూనే ఉన్నాయి. ఇంత చేసినా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఈ పాలసీ పట్ల అంతా సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని అక్కడక్కడ చర్చ వినిపిస్తున్నది. వారితో మాట్లాడినప్పుడు కూడా దృష్టికి వస్తున్న విషయం ఏమిటంటే ఈ పథకాల కంటే సదువు దవాఖాండ్లు ఉచితంగా కల్పిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది కదా! అని మహిళలు మాట్లాడడాన్ని కూడా మనం గమనించవచ్చు. పైగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళల్లో సగానికి పైగా ఉన్నత వర్గాలు ఉద్యోగులు పారిశ్రామిక రంగాలకు భూస్వామ్య వర్గాలకు చెందిన వాళ్లు కూడా ఉన్న విషయాన్ని గమనించినప్పుడు సామాజిక న్యాయం ఎలా అవుతుందో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఉంది. అనాదిగా వివక్షతకు, పేదరికా నికి, దోపిడీకి గురి అయినటువంటి వర్గాలను ఆర్థికంగా భరోసా కల్పించి ఆదుకోవడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించవలసిన అవసరం ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం అమలులో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించకపోగా కోట్ల రూపాయలు ఒకవైపు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతూ ఉంటే ఇతర పథకాలు అమలు కావడం కష్టంగా మారిన విషయాన్ని అటు పాలకులు ఇటు ప్రజలు మహిళలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో ప్రారంభమైనటువంటి ఈ పథకం యొక్క బాగోగు లను ఆలోచించకుండానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఇటీవల ఆగస్టు 15, 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రారంభించడం ఒకరినొకరు అనుకరించడమే తప్ప ప్రయోజనాలను లోతుగా ఆలోచించకపోవడమే అని గుర్తించాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మహిళలు బస్సులలో ప్రయాణించడం వలన అమ్మకాలు గణ నీయంగా పెరిగినట్టు తద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నట్టుగా అభిప్రాయపడుతున్నప్పటికీ అందుబాటులో ఉన్న నిధులను కోల్పోవడం అంటే నేల విడిచి సాము చేయడమే అవుతుంది. అంతేకాదు విద్యకు వైద్యానికి ప్రతి కుటుంబము 60 నుండి 70 శాతం తమ కుటుంబ ఆదాయాన్ని కోల్పోవాల్సి రావడంతో ముఖ్యంగా పేద వర్గాల పైన పడుతున్న ఈ భారాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం పెద్ద లోపం కూడా. " ప్రజలకు ఏది అవసరమో ఆ ప్రధానమైనటువంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలి కానీ ప్రభుత్వ అవసరం కోసం ప్రచారం కోసం కల్పించే సౌకర్యం వల్ల ప్రజలకు వాస్తవంగా ప్రయోజనం అంతగా చేకూరదు. ఇక గమ్మత్తేమిటంటే సంపన్న వర్గాలు కూడా తమ కార్లను వాహనాలను పక్కనపెట్టి ఉచిత ప్రయాణం చేస్తున్నారని, డబ్బున్న వాళ్లకి ప్రజాధనం ఉపయోగపడుతున్నది, ముఖ్యంగా ఉద్యోగులు రోజువారీగా ప్రయాణం చేసే వాళ్ళు ఈ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారంటే ఉన్నత వర్గాలకే ప్రయోజనం చేకూరినట్టు కదా! అనే విమర్శ సర్వత్రా విన బడుతున్నది ఈ విమర్శకు కూడా సమాధానం వెతుక్కోవాల్సి ఉంది."

                "విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు. విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యారంగము బ్రష్టు పట్టిపోతున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గి ప్రైవేటు పాఠశాలల పైననే ఆధారపడడం వలన ప్రభుత్వము తన బాధ్యతను విస్మరించింది అనే విమర్శ తో పాటు ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా విద్యకు బడ్జెట్ను తక్కువ చేయడాన్ని కూడా గమనించాలి. ఇక వైద్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా 10% నిధులను కేటాయించే బదులు ఒకటి రెండు శాతంతో సరిపెట్టుకుంటూ ఉంటే ప్రచార రంగాలకు మాత్రం నిధులను కేటాయిస్తే ఇది నిజంగా సామాజిక న్యాయం ఎలా అవుతుంది? విద్యకు వైద్యానికి పేద కుటుంబాలు లక్షల్లో అప్పు చేసి ఖర్చు పెట్టి కుటుంబాలను గుల్ల చేసుకుంటున్న సందర్భం గమనిస్తే ఏ వర్గాలకు న్యాయం దక్కాలో వాళ్లకు ప్రభుత్వం నిధులను అందించవలసినది పోయి సాధారణంగా పథకాలను అమలు చేయడం వల్ల వివక్షత అసమానతలు అంతరాలు మరింత పెరిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. పైగా అత్యవసర రంగాలపైన పేదలు చేస్తున్న ఖర్చు వాళ్లకు గుదిబండగా మారిన విషయం పాలకులు గ్రహించకపోతే ఎవరు భరోసా ఇస్తారు? ". ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు క్షేత్రస్థాయిలో కొనసాగుతూ ఉంటే బస్సులలో సీట్లు సరిపోక ఘర్షణలతో పాటు పురుషులు నిలబడవలసి రావడం అనేక ఇబ్బంది వలన రెండు వర్గాల మధ్యన సంఘర్షణ వాతావరణం కొనసాగడాన్ని కూడా గమనించవచ్చు." ఏ వర్గాలకైతే ప్రయోజనం అందాలో ఆ శ్రేణులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అందించినప్పుడు కనీస అవసరాలు సమకూర తాయి, మానవాభివృద్ధి సాధ్యమవుతుంది, అసమానతలు అంతరాల వివక్షతను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ఆలోచన లేకుండా అన్ని వర్గాలకు సమానంగా వర్తింప చేసినప్పుడు అసమానతలు అంతరాలు వివక్షతను పెంచి పోషించినట్లే అవుతుంది. ఇది చాప కింద నీరు లాగా సమాజంలోని కొన్ని వర్గాల మధ్యన అసహనం పెరగడానికి ఆస్కారం ఉన్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు." ప్రజలు డిమాండ్ చేయకుండా ఏ పథకాన్ని కూడా అమలు చేస్తే దాని ప్రయోజనం ఆ వర్గాలకు చేరదు ప్రభుత్వానికి కూడా ప్రశంసలు అందవు " అనేది ఒక చారిత్రకమైన సత్యం. ప్రజలు కోరుతున్నటువంటి విద్యా వైద్య రంగాలను తెలంగాణ ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు కూడా పట్టించుకోని అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తే అంతకుమించిన ఆనందం ప్రజల్లో మరొకటి ఉండదు. నిజంగా సుపరిపాలన అంటే అదే కదా! "మహిళలకు సౌకర్యం కల్పిస్తున్నాం అనే పేరుతో సుమారు 5000 కోట్ల రూపాయలను ఏటా ఆర్టీసీకి చెల్లించడం అంటే మళ్లీ మళ్లీ అప్పులు చేయడమే అవుతుంది తప్ప అది సంపదను సృష్టించినట్లు కాదు. చెత్త నుండి కరెంటు ఎరువులు సృష్టించడం, ఇతర ముడి సరుకుల నుండి రకరకాల ఉత్పత్తులను చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలందరినీ శ్రామిక జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే మెరుగైనటువంటి ఆలోచన. పనిని కల్పించకుండా శ్రామిక సంస్కృతిని పెంపొందించకుండా ఉచితంగానే ఉన్న దగ్గరికి అన్ని సమకూర్చుతామంటే గత ప్రభుత్వాల యొక్క దుష్ఫలితాలు పునరావృతం కాక తప్పవు." 2019లో rtc 50రోజుల సమ్మె కొందరి సిబ్బంది బలిధానం అందరికి తెలుసు. ఆ ర్టీసీని బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడం తో పాటు వృద్దులకు, లేదా విద్యార్థులకు, పేదలకు పరిమితం చేస్తే కోట్లు ఆదా అవుతాయి. ఆలోచించండి.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు హరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333