ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్

Aug 29, 2025 - 19:32
 0  4
ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో.. కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.

జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. కాగా, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా.. మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిని క్లోజ్ చేశారు. వరద ధాటికి బ్రిడ్జ్ పిల్లర్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలుపుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333