భువనగిరి డిసిపి కి వినతి పత్రం
అందజేసిన ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్
అడ్డగూడూరు 20 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామానికి వ్యక్తి మందుల వంశీ(ఎల్లేశ్) ఆత్మహత్యకు కారకులు ఐన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి తగిన శిక్ష పడేటట్టుగా చేయాలని భువనగిరి డిసిపి రాజేష్ ని కలిసి మాట్లాడటం జరిగింది.25 రోజులుగా కేస్ ఐన ఏఓన్నుని అరెస్ట్ చెయ్యలేదు అని వారిని వెంటనే అరెస్టు చెయ్యడానికి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరడం జరిగింది.అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మాట్లాడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబం మరియు ఆ గ్రామ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అందీప్ సైదులు మందుల బిక్షం,మందుల బయ్యన్న, వడ్డె యాదగిరి, బెల్లా గిరిబాబు యాదాద్రి జిల్లా నాయకులు శివ,రాజు పాల్గొనడం జరిగింది. పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేంద్ర మహారాజ్ తెలిపారు.