గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Jun 30, 2024 - 19:52
Jun 30, 2024 - 21:57
 0  6
గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

మునగాల 30 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ గ్రామంలోని ప్రధాన రహదారి అయిన ఆర్ అండ్ బి రోడ్డుపై వర్షపు నీరు ఆగడంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారి అయిన స్థానిక మూడో వార్డులో ఈ రహదారిపై చిన్న వర్షం పడితే చాలు నీరు రోడ్డుపై నిలిచి ఉంటుందని ఊరికి ప్రధానమైన రహదారి కావడం తో ప్రజల రాకపోకలకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. చుట్టుపక్కల ఇంట్లో వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున వెంటనే ఈ సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని.అలాగే గ్రామంలో అనేక చోట్ల డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైంది కావున గ్రామాలలో డ్రైనేజీ ఉన్న ప్రదేశాలలో బీచింగ్ పౌడర్ చల్లలి అని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షం లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున సమస్య ల పరిష్కారానికై ఉద్యమిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు మాతంగి తిరపయ్య,ఎర్ర వెంకన్న,మాచర్ల ఉపేందర్, గ్రామ పెద్దలు.గండు ఆదినారాయణ,మాచర్ల వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State