ఈనెల 14న గ్రూపు 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు
హైదరాబాద్ :అక్టోబర్ 09:- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ,గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందిం చింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగ నున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందు బాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్..
అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు.
పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగనున్నాయి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30కి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు, కాగా మధ్యాహ్నం 1.30కు గేట్లు మూతబడతాయని అధికారులు వెల్లడించారు.
అభ్యర్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడినట్లు కూడా తెలియజేశారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మందికి పైగా హాజర య్యారు.అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేశారు.
గ్రూప్ 1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి, ప్రతి పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించ బడుతుంది. పరీక్షలు క్రింది షెడ్యూల్ ప్రకారం ఉంటాయి:
జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ పేపర్): అక్టోబర్ 21
పేపర్-I జనరల్ ఎస్సే
అక్టోబర్ 22
పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం): అక్టోబర్
అక్టోబర్ 23
పేపర్-III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్
అక్టోబర్ 24
పేపర్-IV (ఎకానమీ, డెవలప్మెంట్):
అక్టోబర్ 25
పేపర్-V (సైన్స్ & సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్):
అక్టోబర్ 26
పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం):
అక్టోబర్ 27
మెయిన్స్ పరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది. జనరల్ ఇంగ్లీష్ తప్ప, మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషలో రాయాలి.
గతంలో రెండు సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు...