అడ్డగూడూరూ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ నూతన కమిటీ ఎన్నిక

పేరెంట్స్ అధ్యక్షుడిగా మందుల కిరణ్

Aug 10, 2024 - 23:26
Aug 12, 2024 - 18:09
 0  5
అడ్డగూడూరూ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ నూతన కమిటీ ఎన్నిక
అడ్డగూడూరూ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ నూతన కమిటీ ఎన్నిక

అడ్డగూడూరు10 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో రెండోవ శనివారం సందర్భంగా ప్రిన్సిపాల్ రమా ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నూతన  పేరెంట్స్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికలో అధ్యక్షుడు గా  మందుల. కిరణ్ ఉపాధ్యక్షుడు డప్పు.యాదగిరి,సెక్రటరీ కూరపాటి .సుమలత,జాయింట్ సెక్రటరీ సిరిపంగి.బాలకృష్ణ , కమిటీ సభ్యులు సంజీవ,భీరయ్య, యాదగిరి,నరసింహ,జనార్ధన్, తదితరులు ఎన్నుకోబడ్డారు.అనంతరం అధ్యక్షుడు మందుల.కిరణ్ మాట్లాడుతూ..నా ఎన్నికకు సహకరించిన పేరెంట్స్ కమిటీ సభ్యులకు,విద్యార్థుల తల్లిదండ్రుల ప్రత్యేక కృతజ్ఞ్తలు తెలియజేశారు.పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు.పాఠశాలలోని విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా నా సహాయ పరీక్షిస్తానని అన్నారు.నాతోటి విద్యార్థిని తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లల చదువు పట్ల, వారి పరిశుభ్రత,వారం వారం తెలుసుకొని పిల్లల చదువుకొరకై శ్రద్ధ తీసుకొని వారి సమస్యలపై పోరాడతానని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని తల్లిదండ్రులు,బోధన అధ్యాపకులు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.