ఇటిక్యాలమండలంలో దుస్థితి అధ్వానంగా.  వేసిన పంటలు ఎండిపోయి

Sep 1, 2026 - 19:50
 0  0
ఇటిక్యాలమండలంలో దుస్థితి అధ్వానంగా.  వేసిన పంటలు ఎండిపోయి
ఇటిక్యాలమండలంలో దుస్థితి అధ్వానంగా.  వేసిన పంటలు ఎండిపోయి

.నష్టాల్లో రైతులు. బోర్లు బావుల్లో భూగర్భ జలాలు పడిపోతున్నా యి.

* జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలంలో   ఖరీఫ్ కాలం గట్టెక్క పరిస్థితులు కనబడడం లేదు. బోర్లు బావుల్లో భూగర్భ జలాలు తగ్గు ముఖం పట్టాయి సుమారు 600 మీటర్లు లోతుకు పడిపోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వర్షాలు లేక ఇటిక్యాల మండలం రైతంగం దుస్థితి అద్వానంగా మారింది. 2026 సంవత్సరంలో ఖరీఫ్ సాగు కరువును తప్పించేలా పరిస్థితులు కొట్టుమిట్టుతున్నాయి. రైతులు పెట్టుబడులు పెట్టి ఒక్కసారి కాకుండా రెండుసార్లు విత్తనాలు విత్తుకొని. ఆర్థిక పరిస్థితి రైతన్ననికి ఏర్పడింది. పత్తి .కంది. మిరప. తదితర వంటి పంటలు సాగు చేశారు. మొదటి వర్షానికి కొంతమంది రైతులు పత్తి విత్తనాలు విత్తుకుని అడపాదడ పా మొలకెత్తడంతో మళ్లీ జూన్ చివరన పడిన వర్షానికి పత్తి విత్తనాలు రెండవ దఫా విత్తు కొన ప్రయోజనం లేదు. నాడు వర్షాలు లేకపోవడంతో నిరాశతో ఎదురు చూస్తున్నారు. ఎకరానికి పెట్టుబడు లు 20000 నుంచి 30 వేల మధ్యన ఖర్చయినట్లు కూలీల రేట్లు పెరగడం. ఫర్టిలైజర్ ధరలు పెరగడం. యంత్ర సామాగ్రి సాగు ఖర్చులు పెరగడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వర్షాలు లేనందున పంట పండే పరిస్థితి కనపడటం లేదని రైతులు దిగులు చెందుతున్నారు.   రైతులు నిత్యం ఆకాశం చుట్టూ చూసే దుస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎల్ ని నో ప్రభావం వల్ల తుఫాన్లు చెప్పిన దక్షిణ తెలంగాణ ప్రాంతం నడిగడ్డ రైతన్ననికి కరువు ఏర్పడింది. ఖరీఫ్ కి పెట్టుబడులకు బ్యాంకు రుణాలు బయట వడ్డీలు తెచ్చుకొని రైతులు సాగు చేసుకున్నారు. నేడు అప్పులు మిగిలిపోయాయి కానీ చేతికి పంట వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రైతు కుటుంబాలు పోషించుకునే దుస్థితి కూడా లేకపోవడంతో రైతుకు అవస్థలు తప్పడం లేదని పేర్కొన్నారు. నేడు రైతులు ఖరీఫ్ కాలం చివరి దశలో ఉంది వేసిన పంటలు వానలు లేక సాగునీలకు నోచుకోలేక వాడిపోతున్నట్లు రైతులు కన్నీరు కారుస్తూ నిత్యం వరుణ దేవుని కోసం నిత్యం పూజలు చేస్తున్నారు. పవిత్ర నది జలాలు కృష్ణ తుంగభద్ర నదుల జలాలు తీసుకొచ్చి గ్రామాల్లోని దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చర్చిలో ఉపవాస ప్రార్థనలు మసీదులో ప్రార్థనలు హిందూ దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిత్యము దీపరాధనాతో పూజలు ఇలాగ అనేక వర్గాలలోని రైతులు ప్రజలు నిత్యం పూజలు చేసి వరణదేవుడు కనుకరించకపోతే నేడు కరువు వచ్చే పరిస్థితి ఉందని వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నదుల మధ్యన ఉన్న సాగునీళ్ళకు నడిగడ్డ ప్రాంత రైతాంగాన్ని కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమైనది. పత్తి కంది మిరప తదితర పంటలు పూర్తిగా  దెబ్బతిన్నాయి రైతులు చేసేది ఏమి లేక రాబి సాగు కోసం పెట్టుబడులకు మళ్ళీ అప్పులకు సిద్ధమయ్యారు. రాబి సాగులో వర్షం పడకపోతే రైతన్న పరిస్థితి ఆగోమచరంగా మారుతుందని మండలంలోని  రైతుల ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333