ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామ పంచాయితీ ఎదుట ధర్నా

Jun 14, 2025 - 20:38
 0  2
ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామ పంచాయితీ ఎదుట ధర్నా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఏనుబాముల గ్రామనికి చెందిన కలకోట్ల పాండు రంగన్న శనివారం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదుట తాటి కమ్మలతో గుడిసె వేసి తన భార్య పిల్లలతో నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల మంజూరు అయిన 33మంది ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదన చెందాడు. కూలీ పనులు చేసుకునే తమ కుటుంబానికి ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్లే కార్డు ద్వారా డిమాండ్ చేశాడు.అంతకు ముందు ఎన్నో రోజులుగా ఇల్లు కోసం గ్రామ నాయకులు, అధికారుల చుట్టూ తీరగానని, వారంతా ఇల్లు ఇప్పిస్తామని తీరా జాబితాలో పేరు రాకుండా చేశారని ఆరోపించారు. ఎంపీవో రాజేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ నిర్ణయం మేరకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు.