ఆల్మట్టి జూరాల డ్యాములు నిండిన పల్లెల్లో గ్రామాల చెరువులు,కుంటలు నిండడం లేదు ఎందుకు?

Aug 1, 2025 - 19:50
 0  16

            చెరువులను కుంటలను డ్యామ్లను నింపడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తగదు.?

 రిజర్వాయర్లను నింపకపోవడం వల్ల గ్రామాల చెరువులు కుంటలు నీటితో నిలువలు కావడం లేదు

             ఎలుకూరు గ్రామ చెరువును సందర్శించిన భారత కమ్యూనిస్టు పార్టీ మల్దకల్ మండల కార్యదర్శి గుంటన్నగారి  రంగన్న  (Bgr Yelkur)


జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2025 తెలంగాణ వార్తలు ప్రతినిధి : మల్దకల్     గత నెల వర్షాలు మోతాదులో కురుస్తున్న ఆల్మట్టి డ్యాము జూరాల డ్యాము కుండలా నిండిపోయాయి. జూరాల డ్యామ్ కుండల నిండి వేల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా ప్రవహించడం ప్రజలు చూస్తున్న విషయం యదార్థమే. అంతలా వర్షాలు కురిసి జూరాల డాం  నిండుగా ఉండి నీరు కృష్ణా నది పొడవునా నీరు కిందికి వృధాగా పారుతూ ఉంటే నడిగడ్డ లోని ప్రజలు మా చెరువులు, కుంటలు, డ్యాములు నిండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు గాక నడిగడ్డ ప్రాంతంలోని తక్కువ వర్షాలు కురవడంతో పత్తి పంటలు మొగ్గ దశకు వచ్చిన సందర్భంలో వర్షాల్లేక పత్తి పంటలు ఎండి మొగ్గలు రాలుతూ రైతుల కళ్ళల్లో రుతుపవనాలు  మే నెలలోనే సంతోషం నింపిన ప్రస్తుతం మాత్రం రైతు కళ్ళల్లో  నీరుగారుస్తున్నాయి. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు  నడిగడ్డలోని తుంగభద్ర కృష్ణానది నదుల తీరాల మధ్య ఉన్న నాగర్ దొడ్డి డ్యాం, ముగోనిపల్లి డ్యాం. రాలంపాడు డ్యాం. తాటికుంట డ్యాం  లను వెంటనే నింపి డ్యాముల దిగువన ఉన్న చెరువులను కుంటలను నింపి రైతుల అవసరాలను తీర్చుకునే విధంగా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా.
ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మల్దకల్ మండల కార్యదర్శి  రంగన్న. సిపిఐ ఎలుకూరు గ్రామ కార్యదర్శి YT లక్ష్మన్న మరియు గ్రామ ప్రజలు, రైతులు మల్దన్న,నీల రంగన్న, బంగి రామయ్య,డొంగు నారాయణ, ఆర్ నర్సింలు. టి గోపాల్. పాప  ఆంజనేయులు,మహబూబ్,వెంకట్ రాములు తదితరులు పాల్గొనడం జరిగింది.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333