తమిళ యూట్యూబర్ ను అరెస్టు చేసిన తిరుమల పోలీసులు

Jul 16, 2024 - 19:10
 0  4

తిరుమల : శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూ బర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. 

వీడియోలు ఇటీవల సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. ఆలయ గౌరవానికి భంగం కలిగిం చడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటివాటిపై తితిదే ఐటీలోని సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్ట్ చేశారు. 

వారిని తిరుమలకు తీసుకువచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మరిన్ని సెక్షన్లు జోడించి నిందితులను కఠినంగ శిక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333