ఆరు గ్యారంటీల అమలుపై సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఆరు గ్యారంటీల ను అమలు చేయాలనీ ఈ నెల 20 న జరుగు ఛలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. పాత సూర్యాపేట లో పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20 న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య కోరారు. పాత సూర్యాపేట గ్రామంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయిన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వెంటనే ఇల్లులేని పేదలందరికీ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు,షరతులు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ,రైతు భరోసా15 వేలు, కల్యాణ లక్ష్మి పథకానికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కలిపి ఇవ్వాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు లేకుండా పారదర్శకంగా వ్యవహారించాలని కోరారు.రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన చెందారు. ఇచ్చిన హామీలను,ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామీల అమలుకై ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామ నర్సిరెడ్డి,చామల లింగారెడ్డి,మెడబోయిన సైదులు,తాటికొండ మల్లారెడ్డి,కుంచం వెంకటయ్య,యాకోబు,నెమ్మది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.