అసెంబ్లీలో ఎస్సి,బిసి బిల్లు ఆమోదించిన సందర్భంగా ఘనంగా సంబరాలు
మండల అధ్యక్షుడు జోజి

అడ్డగూడూరు19 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి ,తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, రాష్ట్ర మంత్రులకి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కి, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లెక్సీ ఫోటోకి పాలాభిషేకం చేసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి ,సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటికాల చిరంజీవి, చేడేచంద్రయ్య, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొమ్మగాని అంజమ్మ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్టేపాక బాలరాజు, బాలెం సైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ నాయకులు ,మహిళ నాయకులు ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.