నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులుకు హాల్ టికెట్ పంపిణీ

మద్దిరాల.19 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ కార్యక్రమంలో మండల విద్యాధికారి,ప్రధానోపాధ్యాయులు రాములు నాయక్ తో కలిసి పాల్గొన్న తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి చైర్మన్ మాట్లాడుతూ..విద్యార్థులు 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు నిర్దేశిత ప్రణాళికలను అనుసరించాలని అన్నారు.ఈ ఫలితాలు విద్యార్థి భవితను దిశానిర్దేశం చేస్తాయనీ, విద్యార్థి సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి విద్యార్దికి మంచి మార్కులు సాధించడంతో పాటు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్ది చదువుతో పాటుగా క్రమశిక్షణతో మెలగాలి,మీ తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చాలన్నారు. పేద,మధ్యతరగతి విద్యార్ధుల ఉజ్వల భవిషత్తుకోసం మా వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, ఎంఈఓ రాములు నాయక్ ,పాఠశాల ఉపాద్యాయులు,తదితరులు పాల్గొన్నారు.